January 2024

13_005 వార్తావళి

అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి నెల నెలా వెన్నెల జనవరి నెల కార్యక్రమం “ మట్టిబండి – రచనా వైశిష్ట్యం ” వివరాలు, అమరజీవి స్మారక సమితి బనారస్ హిందూ విశ్వవిద్యాలయం సంయుక్తంగా సమర్పిస్తున్న” శ్రీమతి మాలతీచందూర్ నవల – సిద్ధాంత వ్యాసం ” పోటీ వివరాలు, అమెరికాలో బే ఏరియా తెలుగు సంఘం సమర్పిస్తున్న “ సంక్రాంతి సంబరాలు ” వివరాలు, వంగూరి ఫౌండేషన్ కాకినాడ లో నిర్వహిస్తున్న “ అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు ” వివరాలు …..

13_005 ఆనందవిహారి

అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా నవంబర్ కార్యక్రమం “ నాద తనుమ్ స్మరామి ” విశేషాలు, డిసెంబర్ కార్యక్రమం “ హిందూ మహాసముద్రంలో తెలుగు వాణి ( మారిషస్ అనుభవాలు ) ” కార్యక్రమ విశేషాలు, కాకినాడ లో జాతీయ కాంగ్రెస్ మహాసభల శత వసంతోత్సవం కార్యక్రమ విశేషాలు……

13_005 డూ ఏ డీర్

సహన అబ్బూరి గాజు గ్లాసులపై “ గ్లాస్ జైలోఫోన్ ” పలికించిన వాద్య విన్యాసం….

13_005 డేకేర్ సంస్థలు – ఒక వరం

అమెరికా లో నివసిస్తున్న భారత దేశ వృద్ధులకు సమయము యెట్లా గడుస్తున్నది అనే దానికి నేను, మా వారు… మేమే ఒక నిదర్శనము. ఇంట్లో అమ్మాయి – అల్లుడు ఉదయాన్నే ఉద్యోగరీత్యా బయిటకు వెడతారు. వారి పిల్లలు… మా మనవలు, మనుమరాలు స్కూల్, కాలేజీలకు వెళ్తారు. ఇక మేము ఉదయం నుంచి సాయంకాలం వరకు, వాళ్ళు ఇంటికి వచ్చేదాక ఏమి తోచక కాలం గడపాలి !!! మాకు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినప్పుడు చూసే వాళ్ళు వుండరు. అప్పుడు, అమ్మాయికి వీలైతే ఆఫీసుకి సెలవు పెట్టి ఇంటి నుంచి పని చేసుకుంటుంది. అలా వీలు కానప్పుడు మాకు మేమే తప్పదుగా.

13_005 పరమపురుష…

భావుక చరణం భవసంతరణం
భవ్య సేవక జన భాగ్య వితరణం
అవ్యయ విమల విభూతి విజృంభిత దివ్య మణి
రచిత వివిధాభరణమ్‌

13_005 తో. లే. పి. – అన్నయ్య వి. భూపతిరావు

స్కూల్ చదువు పూర్తి అవగానే మా అన్నయ్య కాకినాడ, పి.ఆర్. కాలేజీ లో ఇంటర్మీడియట్, ఆంధ్ర విశ్వ విద్యాలయం, వాల్తేరు లో B.E., ( Electrical Engineering ) పూర్తి చేసాడు. అప్పుడు కాలేజిలో వాడికి కొలీగ్స్.. ఆప్తమిత్రులు గొల్లపూడి మారుతీరావు, వీరాజీ‌, జ్యేష్ట, కొండముది శ్రీరామచంద్రమూర్తి ప్రభృతులు. వీరి సాహచర్యంలో వాడికి నాటకాలు, రచనలు‌, పాటలు పాడడం వగయిరాలతో అనుబంధం ఏర్పడింది.
తరువాత ఉద్యోగ పర్వం.

13_005 గ్రామ దేవతల పూజలు

జానపద కథల్లో రేణుకా ఎల్లమ్మకు మాతృపూజ చేస్తారు. మాతృపూజా పద్ధతి ఈనాటికీ జానపద కథల్లో నిత్యహరితంగా నిలిచిపోయి ఉంది. జానపద సాహిత్యంలో ఎన్నో కథల్లో ప్రాముఖ్యం వహించేది ఈ అంశమే. ఇక్కడ ప్రతి గ్రామదేవత రూపంలోనూ తల్లి దేవత ప్రత్యక్షమవుతుంది. కొండాపురం, ఎల్లేశ్వరం, సంగమేశ్వరం, ఆలంపురం వంటి అనేక శిల్పాఖనులైన స్థలాలలో ఉండే స్త్రీ ప్రతిమలను చూస్తే, ఈ అంశం స్పష్టంగా తెలుస్తుంది.