10_007

10_007 వార్తావళి

అంతర్జాలంలో హూస్టన్ ( US ) నుంచి “ శాస్త్రీయ సంగీత కచేరీలు “; అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి ‘ నెల నెలా వెన్నెల ‘ నెట్టింట్లో; గ్రేటర్ శాక్రమెంటో తెలుగు సంఘం నిర్వహిస్తున్న కథ, కవితల పోటీల వివరాలు…..

10_007 ఆనందవిహారి

తెలుగువారు సంస్కృతం పేర్లే వాడతారని చెప్పారు. వేదికల మీద నిర్వహించే కార్యక్రమాల్లో ఉపయోగించే అధ్యక్షులు, కార్యదర్శి, వేదిక, ఉపన్యాసం, ప్రసంగం, ధన్యవాదాలు తదితర మాటలన్నీ ఆ భాషలోనే ఉన్నాయని అన్నారు. అశేషాంధ్ర ప్రజానీకం, కరతలామలకం, కాకతాళీయం తదితర పద బంధాలకు అర్థం వివరించారు. తెలుగువారి పేర్లన్నీ సంస్కృతమయమేనని అంటూ… శశి అంటే కుందేలని, కుందేలు ఆకారంలో మచ్చ ఉన్నవాడు కాబట్టి చంద్రుణ్ణి శశి అంటారని వివరించారు.

10_007 కరోనా కాలం

ముఖాలకు..
ముసుగులు తొడుక్కున్నారు.
వాటి వెనుక..
అర్థం తెలియని భావాలు…
అగుపించని భయాలు!

10_007 తో. లే. పి. – హేరీ మిల్లర్

సన్మానం కి కొలబద్దలు మారిపోయాయి. ధనం, పలుకుబడి ఉంటే చాలు, తిమ్మిని బమ్మి చేయడానికి. ఇది కేవలం అటు రాజకీయ రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. అన్ని చోట్లా, అన్ని రంగాలలోనూ వ్యాప్తి చెందింది.
హేరీ మిల్లర్ తన జీవితకాలం లో అధిక భాగాన్ని ప్రకృతి, ప్రకృతి జీవ పరిరక్షణ గురించి శ్రమించారు. అది కూడా నిస్వార్థమైన సేవ. ఆయన కృషికి తగినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఇది చాలా బాధాకరమైన విషయం.

10_007 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – ప్రేమానురాగం

“ ఇన్నాళ్ళు ఇంకొకరికోసం అన్నట్టు కష్టపడ్డాం. ఇప్పుడైనా మన కోసం మనం అన్నట్టు బతుకుదాం ” అన్న శేఖర్ మాటల్లో ఎంతో నిజం ఉందనిపించింది అన్నపూర్ణకు. భర్త పైకి చెప్పటం లేదు గాని ఉద్యోగరీత్యా తరచు ప్రయాణాలు చేసే అతనికి, వెనకటి శక్తి, ఓపిక తగ్గుతున్నాయని గ్రహించింది అన్నపూర్ణ.

10_007 కథావీధి – రావిశాస్త్రి రచనలు 3

గంగరాజెడ్డు గారిని పరామర్శించక పోతే నవల పరిచయం అసంపూర్ణం. కథా ప్రారంభకాలానికి వారు ” డిపాట్మెంట్లో ” హేడ్ కానిస్టేబుల్ గా పరిచయం అయి ముగింపు సమయానికి ఎస్సయి గా మారి, రత్తాలు ఒకసారి టేసన్ కి వెళ్ళిన సందర్భం లో ఆమె ని చూసి ఎవరో పెద్దింటి ఆవిడ అనుకుని కంగారుపడి సీట్లోంచి లేచి నుంచుని నమస్కరిస్తాడు. అప్పటికి ఆయన ప్రమోషన్ కోసం డిపాట్మెంటోళ్ళతో తగవులూ, పేచీలూ, గొడవలూ పడి కోర్ట్ కి ఎక్కి మొత్తానికి ఎస్సై అవుతారు, కానీ ఎస్సై అయ్యేసరికి, సినికల్ అయిపోతారు.

10_007 పాలంగి కథలు – అత్తారిల్లు మొదటిరోజు

నా ప్రశ్నలకీ, అనుమానాలకీ పాపం మాణిక్యాంబ ఎంతో ఓర్పుతో వివరణ ఇస్తుంది. బహుశా అది సంధ్య వేళ గుమ్మాలు తడువడం కాబోలు! ఇద్దరం ఇంచుమించు ఒక వయసు వాళ్లు కావడం, నాకీ పల్లెటూళ్లో చాలా విషయాలు తెలియవనే సానుభూతీ, పట్నంలో పెరిగి చదువుకున్న అమ్మాయని అందరూ అనుకునే ఒదిన సాధారణ విషయాలకి తన మీద ఆధారపడుతుంటే, ఒకింత గర్వంతో కూడిన ఆనందం! మొత్తానికి ప్రతిక్షణం ఏమీ తెలీని దాన్నని అభాసుపాలు కాకుండా, ఇటు ఆడబడుచునీ, అటు సోదెమ్మత్తయ్యనీ చూపించాడు నేను నమ్ముకున్న పార్థసారధి.

10_007 వాగ్గేయకారులు – మహాపండితుడు ముత్తుస్వామి దీక్షితర్

దీక్షితర్ తన కృతి వాతాపి గణపతిం భజేహంలో వినాయకుడిని ” త్రికోణ మధ్యగతం ” అని అభివర్ణిస్తారు. అంటే ఇచ్ఛ, జ్ఞానం, క్రియ అనే మూడు శక్తివంతమైన కోణాలకు నడిమధ్యలో ఉండే కేంద్రమే గణపతి అని అర్థం. మనం వినాయకుడిని వర్ణించినప్పుడు పెద్ద తల ఉండటం జ్ఞానానికి, చిన్నకళ్ళుండటం సునిశిత దృష్టికి, పొడవాటి తొండం జిజ్ఞాసకు, పెద్ద చెవులు ఎవరు చెప్పినా వినతగునని, ఇలాంటి గుణగణాలు అలవరుచుకోవాలని నేర్చుకున్నాం.