12_012

12_012 రేడియో జ్ఞాపకాలు

ఎన్నో రచనలను చేసి ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి ప్రసారం కోసం పంపుతూ ఉండడం—కానీ అలా పంపిన ప్రతిసారి అవి తిరిగి వస్తూండడం జరిగేది. అలా తిప్పి పంపుతూ రేడియో కేంద్రం వారు వ్రాసే ఉత్తరంలో మర్యాద పూర్వకంగా వారి వ్రాసే ఒక వాక్యం ప్రత్యేకించి నన్ను ఆకట్టుకునేది. “ ప్రసారం చేసే విషయంలో మీ రచనను వినియోగించుకోలేనందుకు విచారిస్తున్నాము ” అని వ్రాస్తూ ముగింపు వాక్యంగా “ This does not, In any way, reflect upon the merit of your work ” అని వ్రాసేవారు.
( జూలై నెలలో 20 వ తేదీ రేడియో సృష్టికర్త మార్కొని వర్థంతి, మన దేశంలో రేడియో ప్రసారాల ప్రారంభించిన 23వ తేదీ “ జాతీయ ప్రసార దినోత్సవం ” సందర్భంగా….. )

12_012 చందమామ

సంగీత సామ్రాట్, సంగీత విద్వాన్ శ్రీ ఎం. ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మ గారు స్వరపరిచిన పదకవితాపితామహ అన్నమాచార్యులవారి కీర్తన సౌరాష్ట్ర రాగం, ఆదితాళం లో……

12_012 సాక్షాత్కారము 03

తే. గీ. ఎండవానలలోన తా మెండి తడిసి
శ్రితుల నీడ నిచ్చి సమాదరించుతరులు ;
తమఫలమ్ముల నొకటియున్ తాము తినక
పరులకై దాన మొనరించుతరులు ఋషులు !

12_012 స్వర వీణాపాణి

ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా వారి కోదండపాణి స్టూడియోలో తన తండ్రి గారి సమక్షంలో, తన మిత్రుడు అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి నిర్మాతగా “ చెన్నకేశవ భక్తిమాల ” పేరుతో మద్రాస్ లో తొలి ఆల్బం విడుదల చేశారు. ఈ ఆల్బం లో పాడిన ప్రముఖ గాయని పి. సుశీల గారి చేతుల మీదుగా తొలి పారితోషికం అందుకున్నారు. ఈ ఆల్బం లోనే రెండు పాటలు పాడి తీసుకున్న పారితోషికాన్ని ఆశెస్సులుగా తిరిగి ఇచ్చేశారు మహా గాయని ఎస్. జానకి గారు.

12_012 రామాయణం లో మహోన్నత పాత్రలు

సీతాదేవి త్యాగాగ్ని హెచ్చా ? అన్నరాజ్యము అంటనన్న భరతుని త్యాగం ఘనమా ? సీతారాముల చరణముల తమ జీవితం అర్పించిన లక్ష్మణుని త్యాగనిరతి గొప్పా ? అందరూ అందరే ! వారి పాత్రలను ఆదర్శంగా తీసుకొని మానవజన్మ సార్థకం చేసుకొమ్మని సందేశానిస్తాయి.

12_012 స్త్రోత్రమాలిక – వ్యాసాయ విష్ణురూపాయ…

విష్ణువు యొక్క రూపంలో ఉన్న వ్యాసునకు, వ్యాసుని యొక్క రూపంలో ఉన్న విష్ణువుకు నమస్కారం చేస్తున్నాను. అంటే విష్ణువుకు, వ్యాసునికి అబెధము చెప్పబడింది. విష్ణువే వ్యాసుని యొక్క రూపాన్ని ధరించి వేదాన్ని విభజించాడు అని చెబుతారు. ఈయన బ్రహ్మనిధి. ఈయన వాసిష్టుడు