Language
14_001 తో. లే. పి. – స్వర్ణమాలి గుణవర్ధనే
స్వర్ణమాలి గుణవర్ధనే, కొలంబొ, శ్రీలంక. పట్టా చేతపుచ్చుకుని, 1963 వ సంవత్సరంలో జూనియర్...
14_001 మేలుకొలిపే అద్భుతాలు
వారి కీర్తనలు మేలుకొలికే అద్భుతాలు వాగ్గేయకారులైన అన్నమాచార్యులు, త్యాగరాజస్వామికి...
13_009 తో. లే. పి. – అంబికా సింగ్
అంబికాసింగ్ పూర్వీకులు పంజాబ్ సంతతి కి చెందినవారు, ఆ రోజులలో కుటుంబ పోషణార్ధమై పంజాబును వదలి ఫిజి దీవులకు వలస వెళ్ళి అక్కడ చెరకు పొలాలలో కష్టించి పనిచేసి కుటుంబ అవసరాలను తీర్చుకునేవారు.
అ కోవలో తన కుటుంబ సమేతంగా అంబికా సింగ్ ఫిజికి వెళ్ళి లబాసాలో స్ధిరపడ్డారు. కాలగమనంలో అక్కడ మౌనిదేవో ఇండియన్ స్కూలు అన్న పేరుతో ఒక విద్యాసంస్ధను స్ధాపించి నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా, International Scouts and Guides అన్న అంతర్జాతీయ సంస్ధలో సభ్యునిగా చేరి అదనపు బాధ్యతను నిర్వహించారు.
13_009 మహాగణపతిమ్…
మహా దేవ సుతం గురుగుహ నుతం |
మార కోటి ప్రకాశం శాంతం ||
మహా కావ్య నాటకాది ప్రియం
మూషిక వాహనా మోధక ప్రియం ||
13_009 శాస్త్రాన్ని శోధించాలి – డా. పప్పు వేణుగోపాలరావు
ప్రాచీన జ్ఞానాన్ని సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా గ్రంథస్థం చేసే బృహత్ కార్యం కోసం, ఆ జ్ఞానాన్ని ఉపన్యాసాల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు కొత్తతరం ముందుకు రావాలి. ఆసక్తి ఉన్నవారు సంగీత కళాప్రదర్శనలో ఒక స్థాయికి వచ్చాక శాస్త్రం మీద దృష్టి పెట్టాలి. లక్షణ గ్రంథాలను పరిశోధించాలి. రాగం, లయ, కాల ప్రమాణం, చరిత్ర వంటి విషయాల లోతుపాతులను తెలుసుకోవాలి. గ్రంథాలను వెలువరించి వాటి సారాన్ని విద్యార్థులకి, రసికులకి అర్థమయ్యేలా ప్రాయోగికోపన్యాసాలు చేయాలి. సంగీత జ్ఞానప్రవాహాన్ని కొనసాగించాలి.
13_008 తో. లే. పి. – మేరి ఎకనమౌ
కలం స్నేహం మనసులకు వారధి. ఆలోచనలు-అభిరుచులకు ఒకరికొకరు చిరుకానుకలను జతచేసి పంచుకోవడం ఆనాటి ఆ స్నేహం లోని ఒక ప్రత్యేకత. ఆ స్నేహమాధురి అనుభవైకవేద్యం. నిజానికి, అక్షరాలలో ఇమడనిది. భగవద్దత్తమైన ఈ చెలిమి కలిమిని నేను కేవలం మన భారతవాసులతో మాత్రమే కాకుండా, ఇతర దేశాలకు చెందినవారితో సహా ( శ్రీలంక, నేపాల్, ధాయిలాండ్, బ్రిటన్,అమెరికా, ఫ్రాన్స్, జర్మని, నెదర్ లాండ్స్ మొదలయిన దేశస్ధులతో సహా) పంచుకోవడం నాకొక మధురానుభూతి.
13_008 రామచరిత మానస్
ఈ ఘట్టంలో సీతారాముల కల్యాణ సమయంలో ఆ వధూవరుల రూపవర్ణన, వారు ధరించిన విభిన్న ఆభూషణాల సహితంగా సీతారాముల వర్ణన, లక్ష్మణ, భరత శత్రుఘ్నుల వర్ణన, ఆరోజు అందచేయబడిన విందు, బహుమతుల సహితంగా వర్ణించబడుతోంది.
13_008 మేలుకొలికే అద్భుతాలు
వాగ్గేయకారులైన అన్నమాచార్యులు, త్యాగరాజస్వామికి ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరూ తమ కృతులతో పామరుల నుంచి జ్ఞానులను సైతం ఆలోచింపజేశారు. ఆధ్యాత్మిక, వాస్తవికత, సమాజహితం… ఇలా అన్ని అంశాలను మేళవించి ప్రతి హృదయాన్ని పులకింపజేశారు. అందుకే వారి కీర్తనలు ఎప్పటికీ మానవాళిని మేలుకోలుపుతుంటాయి. వారు రాగం, భావం, సంగీతం సమపాళ్లలో రంగరించడంవల్లే ఎప్పటికీ నిత్యనూతనంగా విరాజిల్లుతున్నాయి.