Singer

13_008 రామచరిత మానస్

ఈ ఘట్టంలో సీతారాముల కల్యాణ సమయంలో ఆ వధూవరుల రూపవర్ణన, వారు ధరించిన విభిన్న ఆభూషణాల సహితంగా సీతారాముల వర్ణన, లక్ష్మణ, భరత శత్రుఘ్నుల వర్ణన, ఆరోజు అందచేయబడిన విందు, బహుమతుల సహితంగా వర్ణించబడుతోంది.

13_008 మేలుకొలికే అద్భుతాలు

వాగ్గేయకారులైన అన్నమాచార్యులు, త్యాగరాజస్వామికి ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరూ తమ కృతులతో పామరుల నుంచి జ్ఞానులను సైతం ఆలోచింపజేశారు. ఆధ్యాత్మిక, వాస్తవికత, సమాజహితం… ఇలా అన్ని అంశాలను మేళవించి ప్రతి హృదయాన్ని పులకింపజేశారు. అందుకే వారి కీర్తనలు ఎప్పటికీ మానవాళిని మేలుకోలుపుతుంటాయి. వారు రాగం, భావం, సంగీతం సమపాళ్లలో రంగరించడంవల్లే ఎప్పటికీ నిత్యనూతనంగా విరాజిల్లుతున్నాయి.

13_007 నీవుండే వేములవాడ

‘ కరీమ్‌నగర్ క్షేత్రాలు ‘ ఆల్బం నుండి డా. వడ్డేపల్లి కృష్ణ సాహిత్యానికి ఏ. ఏ. రాజా సంగీతం సమకూర్చగా పద్మజ శొంటి గానం చేశారు.

13_006 నల్లని మేని నగవు చూపులవాడు ”…

శ్రీమతి భవ్య బేహత గారు అమెరికా చికాగో నగరంలో రెండు దశాబ్దాలుగా వీణ గాత్రం విద్యార్థులకి నేర్పుతున్నారు. బలమైన సంగీత సంప్రదాయాన్ని అమెరికా లో పటిష్ఠం చేస్తూ పాశ్చాత్య సంగీత కళాకారుల మన్ననలు పొందుతున్నారు. భవ్య బేహత డా. ఈమని కల్యాణి గారి నుండి ఈమని వీణా సంప్రదాయ పద్ధతి అభ్యసించి ప్రచారం చేస్తున్నారు. చికాగో “ రాగ ప్రభ “ అంతర్జాతీయ వీణా ఉత్సవాల సందర్భంగా అన్నమాచార్యుల వారి పద సంకీర్తనలు శిష్యులతో ప్రదర్శించారు.

13_006 ఇందరు మనుషులు

డా. సి. నారాయణరెడ్డి గారు రచించిన తెలుగు గజల్ శ్రీమతి సి. ఇందిరామణి స్వరకల్పనలో పద్మజ శొంఠి గారు ఆలపించారు. ఈ గజల్ 1980 దశకంలో హైదరాబాద్ దూరదర్శన్ లో ప్రసారమయింది.

13_003 నవవిధ భక్తి మార్గం

భగవంతుడిపై చూపే ప్రేమకే ‘ భక్తి ’ అని పేరు. దేవుడితో బంధం ఏర్పడేది బాహ్య క్రియలతో కాదు, మలినం లేని భక్తితోనే అని పురాణాలు చెబుతున్నాయి. భక్తుడు భగవంతుని చేరేందుకు ఉపయోగపడే సూత్రాలు పదకొండింటిని నారదుడు ఉపదేశించగా తదనంతరం అవి తొమ్మిదిగా క్రోడీకృతమయ్యాయి.
నిజానికి ఇవి భక్తి మార్గాలు కావు. భక్తికి తొమ్మిది మెట్లు లేక తొమ్మిది లక్షణాలుగా వేదవ్యాసుడు పేర్కొన్నారని ప్రముఖ సంగీత శాస్త్ర నిపుణుడు డాక్టర్ పప్పు వేణుగోపాలరావు అంటారు.

13_002 ఆనాటి రాక్షస వీణ – వైయోలిన్

క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాల నాటిది మన దేశంలోని ‘ రావణ హత్త ’ ఎటువంటి మార్పులూ లేకుండా అప్పటి ఆకార విశేషాలతోనే ఉన్న ఈ వాయిద్యం ఇప్పటికీ రాజస్తాన్, గుజరాత్ లలోని జనపదాల మధ్య మోగుతూ ఉండడం విశేషం. 22 అంగుళాల ఈ వాయిద్యం తయారీ ఆసక్తికరంగా ఉంటుంది. ఒక కొబ్బరి చిప్పను మేక చర్మంతో కప్పి, వెదురుతో చేసిన దండితో కలుపుతారు. దీనిపై రెండు తీగలను బిగిస్తారు. ఒకటి గుర్రం వెంట్రుకతో చేసినది, ఇంకొకటి స్టీల్ తో చేసినది. అప్పట్లో నేటి రాజస్తాన్, గుజరాత్ లలోని రాజ్యాల యువరాజులకు మొట్టమొదట ఈ వాయిద్యం మీదే సంగీత శిక్షణనిచ్చేవారు. ఇదే వాయిద్యం తొమ్మిదో శతాబ్దంలో తూర్పు మధ్య దేశాలకు, యూరప్ కు చేరిందట. ఐరోపా దేశంలో దీన్ని ‘ రావణ స్ట్రాంగ్ ’ అని పిలిచేవారు. వైయోలిన్, వయోలా, గిటార్ వంటి పరికరాలు ఇందులో నుంచే క్రమంగా రూపుదిద్దుకున్నాయి.