Godavari

13_001 ఆనందవిహారి

అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా జూలై నెల “ తెలుగు సాహితి – ప్రాచీనత, ఆధునికత ” ప్రసంగ విశేషాలు, తూర్పు గోదావరి జిల్లా లోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రేరణా ప్రసంగం విశేషాలు, హాంగ్ కాంగ్ లో కార్గిల్ విజయ్ దివస్ ఉత్సవాల విశేషాలు……

13_001 కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం

భారతదేశంలో ఎక్కడైనా ఒకే పానవట్టం మీద ఒకే లింగం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండటం విశేషం. ఒకటి కాళేశ్వరలింగం, రెండవది ముక్తీశ్వర లింగం. ముక్తీశ్వరలింగానికి రెండు నాశికారంధ్రాలున్నాయి. ఆ రంధ్రాలలో ఎంత నీరు పోసినా పైకి రావు. త్రివేణిసంగమతీరంలో ఆ నీరు కలుస్తుందని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది.

12_012 అందాల గోదావరి

శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో శ్రీ ఎల్. మాలకొండయ్య గారు రచించిన ఈ బృంద గానం చేసినవారు డా. చిత్రా చక్రవర్తి, హారిక పమిడిఘంటం, సీతా అనివిళ్ల, సుధా తమ్మా.

12_012 సాక్షాత్కారము 03

తే. గీ. ఎండవానలలోన తా మెండి తడిసి
శ్రితుల నీడ నిచ్చి సమాదరించుతరులు ;
తమఫలమ్ముల నొకటియున్ తాము తినక
పరులకై దాన మొనరించుతరులు ఋషులు !

12_011 సాక్షాత్కారము 02

తే. గీ. ఆకలింగొన్నవారికి అన్నపూర్ణ
యైన దిచట డొక్కాసీతమాంబ ! ఆమె
పుట్టువుం గన్నయీపుణ్యభూమిలోన
భళిర ! క్షుద్బాధతో ౘచ్చువాఁడు లేఁడు!

11_002 ప్రతీచి – లేఖ

సంగీతానికి కావలసినవి రెండు. పాడేవాడి సంస్కారం. వినేవాడి సంస్కారం.
కొన్ని ధ్వనులు, చప్పుళ్ళు మనసుకీ ఆహ్లాదంగా ఉంటాయి. కొన్ని పాటలు అంతే ! అది తాత్కాలికం. రాగంతో అనుభూతి. మనసుకి సంబంధించినది కనుక. కొన్ని వేళల్లో అనుభూతి ఆనందంతో ఆరంభం. మరి కొన్ని భరించలేని దుఃఖం కలిగిస్తూనే పరమ సుఖంలో పర్యవసిస్తాయి. పదే పదే వింటాం. ఏడుస్తాం. మళ్ళీ వింటాం. ద్రవిస్తాం.