Lakshmana

13_008 రామచరిత మానస్

ఈ ఘట్టంలో సీతారాముల కల్యాణ సమయంలో ఆ వధూవరుల రూపవర్ణన, వారు ధరించిన విభిన్న ఆభూషణాల సహితంగా సీతారాముల వర్ణన, లక్ష్మణ, భరత శత్రుఘ్నుల వర్ణన, ఆరోజు అందచేయబడిన విందు, బహుమతుల సహితంగా వర్ణించబడుతోంది.

13_006 మందాకిని – ఆత్మానాం మానుషం మన్యే రామం దశరధాత్మజమ్

మృదుస్వభావి, లేతమనసున్న ఆయన, యువకుడిగా ప్రేమను గెలిచాడు. భర్తగా భార్యని గెలిచాడు. కొడుకుగా తండ్రి కోరిక నెరవేర్చాడు. అన్నగా తమ్ముళ్ళకి రాజ్యాన్ని ఇచ్చాడు. చివరికి రాజుగా ప్రజల సంక్షేమం కోసం, వంశగౌరవం నిలబెట్టడం కోసం తన ఆరోప్రాణం అయిన సీతనే అడవులకి పంపి గొప్ప రాజుగా క్షత్రియ ధర్మం నిలిపాడు. సీత లేని ఎడబాటు భరిస్తూనే రాజ్యపాలన నిర్వర్తించాడు తప్ప ఇంకో పడతి వైపు కన్నెత్తి చూడలేదు. అధికారంలో ఉన్నపుడు సొంత ప్రయోజనాల కంటే విధి నిర్వహణే ముఖ్యం అని ఎలుగెత్తి చెప్పాడు.

12_012 రామాయణం లో మహోన్నత పాత్రలు

సీతాదేవి త్యాగాగ్ని హెచ్చా ? అన్నరాజ్యము అంటనన్న భరతుని త్యాగం ఘనమా ? సీతారాముల చరణముల తమ జీవితం అర్పించిన లక్ష్మణుని త్యాగనిరతి గొప్పా ? అందరూ అందరే ! వారి పాత్రలను ఆదర్శంగా తీసుకొని మానవజన్మ సార్థకం చేసుకొమ్మని సందేశానిస్తాయి.