Lotus

12_010 అమెరికా అమ్మాయితో ముఖాముఖీ 02

విశ్వవ్యాప్తమైన భరతనాట్యము పట్ల నాకున్న ప్రగాఢనమ్మకము, ఆసక్తి, గురువుల వద్ద శిక్షణ, నా నాట్యరీతులకు రూపుదిద్ది, వాటికి ఎన్నో సొగసులను అందించింది. నాట్యానికి భౌగోళికమైన సరిహద్దులు, ఎల్లలు వంటివి లేనేలేవు. నిజం చెప్పాలంటే సమైక్యత, శాంతి, సౌందర్యము కేవలం ఏ కొద్దిమందికో పరిమితం కావు. కళ అన్నది ఒక పరికరము. అది విశ్వవ్యాప్తం. ప్రపంచాన్ని గురించిన విశాల అవగాహన ను కలిగి, జీవితంతో ముడిపడి ఉండడం దాని లక్షణము. లక్ష్యము ..

12_009 కమలోద్భవ కౌత్వం

కలాపాలు, యక్షగానాలు, నృత్యనాటికలతోపాటు కూచిపూడి నాట్యంలో కొన్ని ప్రత్యేకమైన ప్రక్రియలున్నాయి. వాటిలో సింహనందిని, మయూర కవుత్వం లాంటివి దేవాలయ నృత్యాలు. దేవాలయ ఉత్సవాలలో దేవుడికి అర్పించే క్రతువులివి. ముగ్గుపిండిని ఒకచోట పోసి దానిమీద ఒక క్రమపద్ధతిలో నర్తిస్తే సింహం ఆకారం ఏర్పడడం సింహనందినీ నృత్యం. నెమలి ఏర్పడేట్టు చేసే ఇంకొక ప్రక్రియ మయూర కవుత్వం.

12_008 అమెరికా అమ్మాయి నృత్య నీరాజనం

భారతీయ శాస్త్రీయ నృత్యాన్ని గురుముఖంగా ఆసక్తి తో అభ్యసించి, విశ్వవ్యాప్తంగా ప్రదర్శనలను ఇచ్చి పేరు ప్రఖ్యాతులను గడించినవారే ! నిజానికి, వారు పుట్టుక రీత్యా విదేశీయులే అయినా భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల పట్ల అత్యంత ఆసక్తిని, గౌరవాన్ని కలిగి పట్టుదలతో కృషిచేసి ఆ నాట్య రీతులను నేర్చుకొనడం ఎంతో ముదావహం, ప్రశంసనీయం !