Rasa

12_011 బంగారుతల్లి – కనకదుర్గమ్మ

ఇహపరమ్ములు వీడి ఇంద్రకీలాద్రిపై
కొలువున్న మాయమ్మ కనకదుర్గమ్మ !
శ్రీ ఓలేటి వెంకట సుబ్బారావు రచించిన ఈ భక్తిగీతం మధ్యమావతి రాగం లో శ్రీ బ్రహ్మానందం గారు..
స్వరపరచగా శ్రీ ఎమ్.ఆర్.కె.ప్రభాకర్ గారు గానం చేశారు.

12_010 అన్నమాచార్య కళాభిజ్ఞత 15

అలుమేలు మంగ శ్రీవెంకటేశ్వరులు ఆదిదంపతులు. వారి దాంపత్య శృంగార వైభవం లోక కళ్యాణ ప్రదమని విశ్వసించి శృంగార విషయంలో ఒక పరిణితి కలిజ్ఞటువంటి సామాజిక స్పృహ, ఒక అవగాహన పెంచే గమ్యంలో ఈ సంబంధాన్ని, ఈ బంధాన్ని ఆదర్శ మార్గంలో నడిపించేటటువంటి ఆశయంతో రచనలు సాగించారు. అనేకమైన సంకీర్తనలు వెలయించారు. సంయోగంలో స్త్రీ పురుషులిద్దరూ నాయిక, నాయకులు. ఈ నాయికానాయకుల మధ్యనున్న శృంగార సంబంధాన్ని అలుమేలుమంగ శ్రీనివాసులకు అన్వయించి భగవద్విషయం చేసి దాని మీద దైవీభావన పెంచడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో కొన్ని కొన్ని సంకీర్తనల ద్వారా తెలుసుకుందాం.

12_009 అన్నమాచార్య కళాభిజ్ఞత 14

అన్నమయ్య లౌకిక శృంగారాన్ని రోజువారీ మాటల్లోనే ఆయన పొందుపరిచారు. తెలిసిన భావాన్ని ఎవరికి వారుగా, ఎవరికి వారికి తెలిసిన మాటల్లో సున్నితంగా, పదం పదంలోను ప్రతి పదంలోను రసాన్ని సంపూర్ణంగా, దివ్యంగా పండించినటువంటి మహాకవి ఈయన. సారస్వత జగత్తులో ఈ మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. రసమంటే ప్రధానమైన ఒక భాగం. సర్వమైన, సమగ్రమైన, సంపూర్ణమైనటువంటి సారము అంతా కలిపి రసం. రెండవది రుచి. ఈ రెండూ మన అనుభూతిలో ఉన్న విషయాలే !