Ugadi

12_009 రామాయణాల ఇంద్రధనస్సు

అతడా గ్రంథ శ్లోకములందు మరి నాలుగు కావ్యములు గర్చితములగునట్లు కూర్చెను. అయోధ్యకాండ నుండి యుద్ధకాండము వరకును గల శ్లోకముల ప్రధమాక్షరములన్నియు కలిపి చదివినచో “ గౌరీ వివాహ”మను కావ్యమును – ద్వితీయ పాదములందలి ప్రధమాక్షరములన్నియు కలిపినచో “ శ్రీరంగాది క్షేత్రమహాత్మ్యము ” – తృతీయ పాదాద్యక్షరములన్నియు కలిపినచో “ భగవదవతార చరిత్ర ” కావ్యమును – చతుర్థ పాదమునందలి అక్షరములన్నియు కలిపినచో “ ద్రౌపదీ కల్యాణం ” కావ్యమును ఏర్పడును. బాలకాండమునందలి శ్లోకముల ప్రధమాక్షరములన్నియు కూర్చినచో “ రామకవచ ”మేర్పడును. ఇది చతుస్సర్గ కావ్యమన ప్రశంసించబడినది.

12_009 శ్రీరామ రామేతి

శ్రీ విష్ణు సహస్రనామ పారాయణతో సంబంధం గలిగిన శ్లోకం ‘ శ్రీ రామ రామేతి…. ’. ఆ సంబంధం ఏమిటి ? అసలు సహస్ర నామ ప్రాశస్త్యం ఏమిటి ? ఎందుకు చదవాలి ? దానికి ఈ శ్లోకము ఎలా ప్రత్యామ్నాయము అవుతుంది ?… ఈ విశేషాలు…..

12_008 వార్తావళి

చెన్నై అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న “ శ్రీమతి మాలతీచందూర్ గారి ‘ హృదయనేత్రి ’ నవల – సిద్ధాంత వ్యాస రచనల పోటీ ” వివరాలు, అమెరికాకు చెందిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నిర్వహిస్తున్న ‘ 28వ ఉగాది ఉత్తమ రచనల పోటీ ’ వివరాలు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( NATS ) నిర్వహిస్తున్న మహిళల, బాలల సంబరాల వివరాలు …..

11_004 హాస్యగుళికలు – భామా కలాపం

అందరిళ్ళలోలా కాకుండా రామారావు గారింట్లో మాత్రం అన్ని పండుగలు వేరేగా ఉంటాయి. ఉగాది పండుగైతే మరీ ప్రత్యేకం. ఆరోజు రామారావు గారి భార్య భద్ర పంతులుగారి పంచాంగ శ్రవణం బదులు తన పంచాంగం చదివేస్తుంది. ప్రొద్దున్నే లేచి మొదలెట్టేస్తుంది.