Vinayaka

13_007 చిన్ననాటి జ్ఞాపకాలు

1949 వ సంవత్సరంలో పెద్ద ఉప్పెన గాలి వచ్చింది. అంటే తుఫాను లాంటిది. మా ఇల్లు పెద్ద మండువా ఇల్లు. ఇల్లు రోడ్డు కంటే పల్లముగా ఉండడంవల్ల ఇంటిలోకి నీళ్ళు వచ్చాయి. తుఫాను తీవ్రత తగ్గిన తర్వాత ఇంట్లోనుండి బయటకు వెళ్లి చూస్తే, మా చిన్నాన్న గారి ఇంటిలో నారింజ చెట్టు పడిపోయింది. కాయలన్నీ రాలిపోయాయి.
చెరువు గట్టు వైపు చూస్తే, చెట్ల కొమ్మలు విరిగి నేల మీద పడి ఉన్నాయి. కాకులు గుట్టలుగా చచ్చిపడి ఉన్నాయి. ఎన్నో జంతువులు చచ్చిపోయాయి.

13_002 గణేశ స్తుతి

చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం।
కామరూప ధరం దేవం వందే హం గణనాయకమ్‌ ॥
—————————————
గజవదనా బేడువే గౌరీ తనయా
త్రిజ్జగ బందిద్దనే సుజనరపొరవనే ||

12_012 సాక్షాత్కారము 03

తే. గీ. ఎండవానలలోన తా మెండి తడిసి
శ్రితుల నీడ నిచ్చి సమాదరించుతరులు ;
తమఫలమ్ముల నొకటియున్ తాము తినక
పరులకై దాన మొనరించుతరులు ఋషులు !

12_011 సాక్షాత్కారము 02

తే. గీ. ఆకలింగొన్నవారికి అన్నపూర్ణ
యైన దిచట డొక్కాసీతమాంబ ! ఆమె
పుట్టువుం గన్నయీపుణ్యభూమిలోన
భళిర ! క్షుద్బాధతో ౘచ్చువాఁడు లేఁడు!

12_011 స్త్రోత్రమాలిక – శుక్లాంభరధరం …

ఏ పని ప్రారంభించాలన్నా మనకి ముందుగా గుర్తుకు వచ్చేది విఘ్ననాయకుడైన గణపతి. తలపెట్టిన పని నిర్విఘ్నంగా సాగాలని ముందుగా ఆ గణపతి ని పూజించి అసలు పని ప్రారంభిస్తాము. గణపతి అనగానే మనకి గుర్తుకు వచ్చే ధ్యాన శ్లోకం “ శుక్లాంభరధరం విష్ణుం…. ”.