Keertana

సునాదసుధ – ఆథ్యాత్మిక తత్వ సంకీర్తన

అమెరికా చికాగో దగ్గరలో ఫ్లాస్ మోర్ లో ఉన్న ‘ సునాదసుధ ‘ సంగీత కుటీరంలో జరిగిన ప్రదర్శన.
…. బౌలి రాగం లో అన్నమాచార్య కీర్తన….
ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ||

13_004 క్షీరాబ్ది కన్యకు

సాధారణంగా ఈ అన్నమయ్య కీర్తన ని శ్రీమతి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు మనకు వదిలి వెళ్లిన ఆనవాయితీ ప్రకారం ఝంపె తాళం లో పాడటం అందరికీ విదితమే. అయితే, ఝంపె తాళం కేవలం 5 అక్షరాలే కలిగి ఉన్నందున గాయకులు దాంతో కష్ట పడుతూండటం కూడా గమనిస్తూనే ఉంటాం. అలా కాకుండా త్రిశ్రగతిలో ఉంటే పాటను తాళాన్నీ కూడా మరింత సులువుగా సమర్ధించు కొనే వీలును కల్పించడానికి అదే పాటను ఇలా పాడే చొరవ తీసుకున్నాను.

12_010 సునాదసుధ – నమో నమో రఘుకుల నాయక

అమెరికా చికాగో దగ్గరలో ఫ్లాస్ మోర్ లో ఉన్న ‘ సునాదసుధ ‘ సంగీత కుటీరంలో జరిగిన ప్రదర్శన నుంచి విద్వాన్ అరవింద్ సుందర్ గానం చేసిన అన్నమయ్య కీర్తన… నాట్ట రాగం, రూపక తాళం.
నమో నమో రఘుకుల నాయక దివిజవంద్య
నమో నమో శంకరనగజానుత…..

12_010 పరాకు చేసిన…

రాముడి పైనే రాసిన, ఈ జుజాహుళి రాగ కీర్తనలో త్యాగరాజుగారు రామనామాన్ని ఒక్కసారి కూడా పలకరు. కొన్ని సార్లు భక్తులు భగవంతుడిమీద అలిగి నిందస్తుతి చేసినట్టు. ఇందులో నిందలేకపోయినా రాముడికి వేర్వేర పేర్లతో బ్రతిమాలటం ఆసక్తికరంగా ఉంటుంది.

12_008 సునాదసుధ – నగుమోము గనలేని

అమెరికా చికాగో దగ్గరలో ఫ్లాస్ మోర్ లో ఉన్న ‘ సునాదసుధ ‘ సంగీత కుటీరంలో జరిగిన గిటార్ పైన బర్కిలీ స్కూల్ సంగీత విశ్వవిద్యాలయంలో పాశ్చాత్య శాస్రీయ సంగీతంతో పాటు భారతీయ కర్ణాటక సంగీత బాణీ లో ప్రతిభ పొందిన “ జో రూఎన్ “, హిందూస్తానీ తబలా వాద్యంలో పేరు పొందిన “ ధనంజయ్ కుంటే “ ల ప్రదర్శన.
అభేరి రాగం, అది తాళం, త్యాగరాజ కీర్తన.

11_001 AV నారాయణతే నమో నమో

Narayanathe Namo Namo – Neeraja – Vocal
నారాయణతే నమో నమో – అన్నమాచార్య కీర్తన
నీరజ విష్ణుభట్ల ( బి హై గ్రేడ్ కళాకారిణి, ఆకాశవాణి )