October 1, 2022

12_004AV సింహనందిని

ప్రాచీన కాలంలో ఆలయాల్లో ఉత్సవాలు జరిగే సమయంలో ఆలయ నృత్య కళాకారులు రధోత్సవ సమయంలో రధం బయిల్దేరుతుండగా ఆ రధం ముందునృత్యం చేస్తూ కాలితో, రంగుల పొడి ని జల్లుతూ ఆ ఆలయంలో ఉండే దేవతా మూర్తి యొక్క వాహన రూపాన్ని చిత్రీకరించేవారు. “ సింహనందిని ” నృత్యంలో దుర్గామాత వాహనమైన సింహాన్ని, “ మయూర కౌతమ్ ” నృత్యంలో కుమారస్వామి వాహనమైన నెమలిని, “ మహాలక్ష్మి ఉద్భవం ” నృత్యంలో లక్ష్మీదేవి ఆసనమైన కమలం ఆకారాన్ని చిత్రీకరిస్తారు.

12_004AV లలితా హారతి

రచన, సంగీతం కీ.శే. ముత్తు కృష్ణన్
పాడినవారు: కె.ఎస్. వసంతలక్ష్మి మరియు శిష్యులు అరుణా వెంకట్రామన్, నమ్రత కుమార్.
మృదంగం: వెట్రి భూపతి, తంబూరా: జ్యోతి

12_004AV శారదా భుజంగ స్త్రోత్రం

సువక్షోజకుమ్భాం సుధాపూర్ణకుంభాం
ప్రసాదావలమ్బాం ప్రపుణ్యావలమ్బామ్ ।
సదాస్యేన్దుబిమ్బాం సదానోష్ఠబిమ్బాం
భజే శారదామ్బామజస్రం మదమ్బామ్

12_004AV సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 04

లీలాశుకుడు బాలకృష్ణుని ముగ్ధ మోహన రూపాన్ని, బాల్యచేష్టలను మన కన్నుల ముందు ఉంచుతారు. వీరి రచనలు శ్లోకాలే కాని వీరి శైలి గానాననుకూలమై చక్కని గేయ రచనల లాగా సాగుతుంది. ఈ మహాకవి, భక్తాగ్రేసరుడు రచించిన ‘ కృష్ణ కర్ణామృత ’ శ్లోకాలు గానం చేయని సంగీత సభలు, భజన్ గోష్టులు ఉండేవి కావంటే అతిశయోక్తి కాదు. బహుశా కృష్ణ భావనలోనే గానం అందివస్తుందేమో మరి…..
….. లీలాశుకుని “ శ్రీకృష్ణ కర్ణామృతం ” గురించి…..