October 15, 2022

12_005 ముకుందమాల – భక్తి తత్వం 12

అహంకారం భగవత్రాప్తికి ప్రతిబంధకం. అహంకారం తొలగితేనే కాని శిరసువంగదు. అహంకార రహిత స్థితి నందినందుకు గుర్తు శిరసువంగడం. గర్వితులగు రాజులకోఉపకారాలాశించి ధనవంతులకో నమస్కరించడం మామూలే. కానీ అలాకాక ఆ పరాత్పరునిసహజ ప్రేమతోభక్తితో శరణువేడి నమస్కరించడం తనను తాను పరమాత్మకు నివేదించుకోవడం అవుతుంది. భక్తి అంతరంగంలో ఉండటమేకాదు. దాన్ని భౌతికంగా కూడా వ్యక్తపరచగలగాలి అంటే మనోవాక్కాయ కర్మలా ఆ పరమాత్ముని సేవలోనే జీవితమంతా గడచిపోవాలన్నమాట. ఈ దశలన్నీ సదా అనుభవిస్తూ ఉండాలన్నదే శ్రీ కులశేఖరుల వారి కోరిక!