Light

13_009 మహాగణపతిమ్…

మహా దేవ సుతం గురుగుహ నుతం |
మార కోటి ప్రకాశం శాంతం ||
మహా కావ్య నాటకాది ప్రియం
మూషిక వాహనా మోధక ప్రియం ||

13_006 మందాకిని – ఆత్మానాం మానుషం మన్యే రామం దశరధాత్మజమ్

మృదుస్వభావి, లేతమనసున్న ఆయన, యువకుడిగా ప్రేమను గెలిచాడు. భర్తగా భార్యని గెలిచాడు. కొడుకుగా తండ్రి కోరిక నెరవేర్చాడు. అన్నగా తమ్ముళ్ళకి రాజ్యాన్ని ఇచ్చాడు. చివరికి రాజుగా ప్రజల సంక్షేమం కోసం, వంశగౌరవం నిలబెట్టడం కోసం తన ఆరోప్రాణం అయిన సీతనే అడవులకి పంపి గొప్ప రాజుగా క్షత్రియ ధర్మం నిలిపాడు. సీత లేని ఎడబాటు భరిస్తూనే రాజ్యపాలన నిర్వర్తించాడు తప్ప ఇంకో పడతి వైపు కన్నెత్తి చూడలేదు. అధికారంలో ఉన్నపుడు సొంత ప్రయోజనాల కంటే విధి నిర్వహణే ముఖ్యం అని ఎలుగెత్తి చెప్పాడు.

13_004 సమయము తెలిసి…

అసావేరి రాగం, మిశ్రచాపు తాళం లో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి కీర్తన.
సమయము తెలిసి పుణ్యములార్జించని
కుమతి ఉండియేమి పోయియేమి

13_004 దివ్వెల పండుగ

మానవుడు వెలుగును – ఆథ్యాత్మిక, ఆదిభౌతిక సంపదలకు చెందినది – సంతరించుకోవడం కోసం ప్రాకులాడుతూ వుంటాడు. ప్రాపంచిక రీతులలోనుంచి, గతుల నుంచి తప్పించుకొని, తపస్సిద్ధ్హి సంపన్నుడు కావడానికి ప్రయత్నిస్తూ వుంటాడు. విజ్ఞాన తేజః పుంజంగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ వుంటాడు. అలాటి స్థితికి ప్రతీక దీపావళి. దివ్వెను చూస్తే మనస్సులో ఏదో మువ్వల మ్రోత వినిపిస్తుంది. అది అద్భుతమైన స్పందన. అలాటి వెలుగును కనులారా దర్శించి, మనస్సులో వెలుగులో కలబోయడం కోసమే దీపావళి.

13_003 యోగనిద్రలో…

యోగనిద్రలో తిరుమల దేవుడు….
డా. వడ్డేపల్లి కృష్ణ సాహిత్యానికి స్వరకల్పన చేసి పద్మజ శొంఠి గారు గానం.

13_002 ప్రసన్న వదన

శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు రచించిన ఈ భక్తి గీతం గానం చేసినవారు పద్మజ శొంఠి.

13_001 హిమాలయం

శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు రచించిన ఈ బృంద గానం చేసినవారు రాగసుధ విద్యార్థులు.

12_012 అందాల గోదావరి

శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో శ్రీ ఎల్. మాలకొండయ్య గారు రచించిన ఈ బృంద గానం చేసినవారు డా. చిత్రా చక్రవర్తి, హారిక పమిడిఘంటం, సీతా అనివిళ్ల, సుధా తమ్మా.