Profession

13_009 తో. లే. పి. – అంబికా సింగ్

అంబికాసింగ్ పూర్వీకులు పంజాబ్ సంతతి కి చెందినవారు, ఆ రోజులలో కుటుంబ పోషణార్ధమై పంజాబును వదలి ఫిజి దీవులకు వలస వెళ్ళి‌ అక్కడ చెరకు పొలాలలో కష్టించి పనిచేసి కుటుంబ అవసరాలను తీర్చుకునేవారు.
అ కోవలో తన కుటుంబ సమేతంగా అంబికా సింగ్ ఫిజికి వెళ్ళి‌ లబాసాలో స్ధిరపడ్డా‌రు. కాలగమనంలో అక్కడ మౌనిదేవో ఇండియన్ స్కూలు అన్న పేరుతో ఒక విద్యాసంస్ధను స్ధాపించి నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా‌, International Scouts and Guides అన్న అంతర్జాతీయ సంస్ధలో సభ్యునిగా చేరి అదనపు బాధ్యతను నిర్వహించారు.

13_008 తో. లే. పి. – మే‌రి ఎకనమౌ

కలం స్నేహం మనసులకు వారధి. ఆలోచనలు‌-అభిరుచులకు ఒకరికొకరు చిరుకానుకలను జతచేసి పంచుకోవడం ఆనాటి ఆ స్నేహం లోని ఒక ప్రత్యేకత. ఆ స్నేహమాధురి అనుభవైకవేద్యం. నిజానికి, అక్షరాలలో ఇమడనిది. భగవద్దత్తమైన ఈ చెలిమి కలిమిని నేను కేవలం మన భా‌రతవాసులతో మాత్రమే కాకుండా, ఇతర దేశాలకు చెందినవారితో సహా ( శ్రీలంక, నేపాల్, ధాయిలాండ్, బ్రిటన్,అమెరికా, ఫ్రాన్స్, జర్మని, నెదర్ లాండ్స్ మొదలయిన దేశస్ధులతో సహా) పంచుకోవడం నాకొక మధురానుభూతి.

13_008 మేలుకొలికే అద్భుతాలు

వాగ్గేయకారులైన అన్నమాచార్యులు, త్యాగరాజస్వామికి ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరూ తమ కృతులతో పామరుల నుంచి జ్ఞానులను సైతం ఆలోచింపజేశారు. ఆధ్యాత్మిక, వాస్తవికత, సమాజహితం… ఇలా అన్ని అంశాలను మేళవించి ప్రతి హృదయాన్ని పులకింపజేశారు. అందుకే వారి కీర్తనలు ఎప్పటికీ మానవాళిని మేలుకోలుపుతుంటాయి. వారు రాగం, భావం, సంగీతం సమపాళ్లలో రంగరించడంవల్లే ఎప్పటికీ నిత్యనూతనంగా విరాజిల్లుతున్నాయి.

13_007 తో. లే. పి. – కెంఛో

మైత్రీబంధం ఇరువురి మధ్యన నెలకొనడానికి మూలము ఏమిటీ అంటే ఇది అని ఇదమిద్ధంగా చెప్పలేము. వాస్తవానికి ఎల్లలెరుగనిది స్నేహం. దేశం, భాష, వృత్తి‌, కులం-గోత్రాలతో దీనికి సంబంధం లేదు.
నేటికీ సుమారు 38 ఏళ్ళ క్రితం, అంటే – 1986 వ సంవత్సరంలో నాకు దక్షిణ భూటాన్ లోని ‘ గేలెగ్‌ఫగ్’ కి చెందిన కెంఛో అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

13_001 కనువిప్పు

వృత్తి పరంగా బిజీగా ఉండే భర్తను, పాశ్చ్యాత్య వాతావరణంలో పెరిగే పిల్లల్ని ఎలా చూసుకోవాలో, వారికి కావాలిసినదేమిటో, వాళ్ళ దగ్గరనుంచి తను పొందవలసినదేమిటో తెలుసుకోలేక పోయింది శిరీష. తన జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని ఎలా బాలెన్స్ చేసుకోవాలో తెలియక తికమక పడింది. ఆ తికమక లో శిరీషకు తెలియకుండానే తనలో దాగి వున్న అహంభావం, నిర్లక్ష్యం, సోమరితనం బయటకు తన్నుకువచ్చేవి. దాంతో ఇంట్లో ఎప్పుడూ గొడవలు . . .పోట్లాటలు. . . కోపతాపాలు… మౌనం.