Publications

13_008 ఉగాది – శ్రీరామనవమి

ఉగాది అంటే ఏమిటి ? ఉగాది రోజున తప్పనిసరిగా చేసే ‘ ఉగాది పచ్చడి ‘ విశిష్టత ఏమిటి ? ఉగాది రోజున పంచాంగ శ్రవణం చెయ్యడం సాంప్రదాయం. ఈ పంచాంగ శ్రవణం అంటే ఏమిటి ? అందులో ఉండే అంశాలు ఏమిటి ? వాటి విశేషాలు ఏమిటి ? ….. వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు… శ్రీరాముని గురించిన విశేషాలు, ఆయన పుట్టుక, ఆయన వ్యక్తిత్వ విశేషాలను వివరిస్తూ సీతారామ కల్యాణ విశేషాలతో బాటు శ్రీరామనవమి విశిష్టత, దానితోబాటు వచ్చే వసంత నవరాత్రుల విశేషాలను వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు.

13_007 ఓం నమశ్శివాయః – హోళికా పూర్ణిమ

ఓం నమశ్శివాయః
మాఘమాసంలో బహుళ పక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటాము. క్షీరసాగర మధన సమయంలో భయంకరమైన హాలాహలం వెలువడింది, దాని నుంచి వెలువడుతున్న విషజ్వాలల వలన ప్రపంచమంతా నాశనం అయ్యే పరిస్తితి ఉత్పన్నమయింది. అప్పుడు దేవతలంతా శివుని ప్రార్థించారు. వారి ప్రార్థనకు కరిగిపోయి ఒక్క గుక్కలో ఆ హాలాహలాన్ని మింగేశాడు. ఆ విషం ఆయన గొంతు నుంచి క్రిందకు జారితే సమస్త విశ్వం ప్రమాదంలో పడుతుందని గ్రహించిన పార్వతి శివుని గొంతుని నొక్కిపెట్టి ఆ హాలాహలం క్రిందకు జరకుండా చూస్తుంది. దానివలన ఆయన కంఠం కమిలిపోయి నీల వర్ణానికి మారిపోవడంతో ‘ నీలకంఠుడు ’ అయ్యాడు. ఈ సంఘటన జరిగిన రోజే ‘ శివరాత్రి ’ పర్వదినం అయింది.

13_006 మాఘం

మౌని అమావాస్య తర్వాత ప్రవేశించిన మాఘమాసం చాలా ప్రత్యేకతలు కలిగి వుంటుంది. శారీరిక ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చే సముద్ర స్నానాలు, సూర్యదేవునికి పూజలు ఈ మాసం ప్రత్యేకత. మాఘపూర్ణిమ రోజున తప్పనిసరిగా చాలామంది సముద్ర స్నానాలు ఆచరించడం సంప్రదాయం. ఈ మాఘమాసంలో స్నానాల ప్రత్యేకతలు, విశేషాలు వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు…..

13_005 సంక్రాంతి

తెలుగు వారి పండుగలలో పెద్ద పండుగ సంక్రాంతి.
మన పండుగలన్నీ సంప్రదాయం ప్రకారం సామాజికాంశాలతో బాటు ఆథ్యాత్మికాంశాలు కూడా కలగలసి ఉండడం జరుగుతుంది.
సంక్రాంతి నాలుగు రోజుల పండుగగా చెప్పుకోవచ్చును. మొదటి రోజు భోగి, రెండవరోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ, నాలుగవరోజు ముక్కనుమ గా జరుపుకుంటారు.

13_004 కార్తీక మాస ప్రాశస్త్యము

కార్తీక మాసము ప్రత్యేకంగా కుమారస్వామికి సంబంధించినదిగా పెద్దలు చెబుతారు. కృత్తికా నక్షత్రములో చంద్రుడు ఉంటుండగా పూర్ణిమ ఉండే మాసము కార్తీక మాసము. ఈ కృత్తికా నక్షత్రములు కార్తికేయునిగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి లేక కుమారస్వామి యొక్క తల్లులుగా చెప్పబడుతాయి. ఆరు నక్షత్రముల గుంపు ఈ కృత్తికలు.

13_003 అన్నమాచార్య కళాభిజ్ఞత 18

రామాయణం త్రేతాయుగ కాలానికి చెందిన రామస్వామి వృత్తాంతం. మానసిక పరివృత్తికి, ధార్మిక ప్రవృత్తి కి, సుకర్మానురక్తికి మార్గం చూపగలిగే దివ్యమైన కావ్యము.
తేన వినా తృణమపి న చలతి
నీ సంకల్పమే లేకపోతే ఏదీ సాధ్యం కాదు. సర్వం రామ సంకల్పాధీనం అని ఎరిగిన అన్నమాచార్యులు రామకథ ని అత్యద్భుతంగా తన సంకీర్తనలలో రచించిన వాటికి కొన్ని ఉదాహరణలు….

13_002 అన్నమాచార్య కళాభిజ్ఞత 17

సూత సంహితలో ఒక దివ్యమైన శ్లోకం చెప్పుకుందాం.
” గీతి గానేనయోగస్యాత్ l యోగా దేవ శివైక్యతా
గీతిజ్ణ ఓ యది యోగేన l సయతి పరమేశ్వమ్ ll ”
సంగీతం ఒక దివ్యమైన సాధన. ఒక మహా యోగం.
ఆ మహా యోగ సాధన వలన జీవునికి బ్రహ్మపద ప్రాప్తి కలుగుతుంది.
సంగీత జ్ఞానము వలన ఐశ్వర్యము అంటే ఈశ్వర తత్వ సిద్ధి కలుగుతుంది
అని భావం .
ఇది లోతెైన విషయం, లౌకిక విషయం కాదు.

13_002 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 08

అనాది నుండి పరమేశ్వరుడు స్వయంగా మెచ్చి కొలువున్న పట్టణం వారణాశి. సంగీత, సాహిత్య, ఆథ్యాత్మిక త్రివేణీ సంగమ స్థలం. జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని భావించే ప్రతి ఒక్కరూ కాశీ పట్టణాన్ని, విశ్వేశ్వర దేవుని దర్శించుకోవాలని తలపోస్తూ వుంటారు. అటువంటి కాశీ వాసులైన కొందరు భక్తుల గురించి చెప్పుకుందాం. భక్త కబీరు గురించి, ఆయన జీవిత విశేషాల గురించి చెప్పుకుందాం. ఎంతవరకు నిజమో తెలియదు గాని కబీరు దాస్ పుట్టుక గురించి ఒక అలౌకికమైన కథ ప్రచారంలో ఉంది. అది…..

13_001 అన్నమాచార్య కళాభిజ్ఞత 16

తాళ్ళపాక పద కవితలు గాన విధానాన్ని బట్టి నాలుగు విధాలుగా ఉన్నాయి. వ్యక్తి గాన పదాలు అంటే స్త్రీలు స్త్రీలకోసం పాడుకునేవి, పురుషగాన సంప్రదాయాలు. సమూహ పదాలు అంటే ఇద్దరూ కలిసి పాడుకునేవి, సంవాద పదాలు అంటే స్త్రీ పురుషుల మధ్య సంవాదము, సంభాషణ, చర్చ జరిగినవి, ప్రక్రియా పదాలు అంటే విషయాన్ని అనుసరించి అంశానికి అనుగుణంగా స్త్రీలు, పురుషులు కలిసి లేదా విడివిడిగా సంభాషణ అనే ప్రక్రియలలో అన్నమాచార్యులు రచనలు చేశారు. భాషా బేధాన్ని బట్టి ఆంధ్ర భాష, సంస్కృత భాష, గ్రామ్య భాష లోనూ సంకీర్తనా రచనలు చేశారు అన్నమాచార్యులు.

13_001 ఓయి భారతీయుడా !

విశ్వశాంతి కాంక్షించే వేదం ధర్మం మనది
అల్ప భావనలు నింపే – మతములు మనకేలరా
రామరాజ్యమ్మును కృష్ణ సారధ్యమును
వివేకానంద స్ఫూర్తులందుకొనుమ సోదరా