13_009 మందాకిని – శ్రీకృష్ణ కందార్థములు

1. వ్రేపల్లెలోన పెరిగిన గోపాలుని కథలు విన్న కొండలవంటి పాపములు తొలగి శుభములు ప్రాప్తించును. ఎవరినోట పాడినా, విన్నా శ్రీహరి లీలా జాడ గనుగొనిన

ఏమారు ఏపాటి నెదలను ఎడబాపు పాపములను మాపు, చింతలు మాపు, కుచ్చితంబులు మాపు పాడినా విన్నా||

2. వింతలు సలిపేవి రుక్మిణీకాంతుడు వ్రేపల్లెలోను కామాతురుడై ఇంతులతో క్రీడింపుచు గంతులు వేయుట తమాషా కతలు పుట్టే ఘనుడు వసుదేవ కలికికి పుట్టే సంతత యశోదా చనుబాలు గ్రోలుచు కాంతా కృష్ణుడు గొల్ల గృహములలో చిత్ర॥ కలతలు పుట్టే ||

3. గోపేమ్మ నీ కుమారుడు పాపడు గాదమ్మ పాల భాండము లెల్లన్, జోకొట్టి ఉట్ల కెగబడి కాపోవగ జుర్రెనోహో || అంభోజ నయనా॥ అది ఏమంటే కోపించె పైనా

రేపుమాపున మేము రెప్పపాటున వదలి రాపాడలేము మీ గారాబు తనయుని || అంభోజనయనా ||

4. ఏమీ యాదవ నందన భామల ఇండ్లెటుల నీకు పరిచయమాయెన్

ప్రేమతో వెన్న భుజింపుము కోమల శుభగాత్ర మదిలో కోరితి వటరా

పొరుగిండ్ల లోన దూరుట మేలా రామరామ వట్టి రాలుగాయవటంచు

సామజగమనలు చాడీలు చెప్పెదరూ – || కోరితివట రా ||

5. తల్లీ ఎటువ౦టినా వారిండ్లే నేనెరుగనమ్మ ఇంతులు పిలచి కల్లలు

గావించిరి. ఓ అల్లుడా రమ్మనచు పిలిచి హస్తాలు చాచి

కొని చనిరెంతో ప్రస్తుతి చేసి చల్లా వెన్నలు పాలు సఖియ నేతులు గ్రోల

ఉల్లాసంబున వారి ఉట్లు నాకందునా ॥ హస్తాలు చాచి॥

6. చాలునే చెలులారా పసి బాలుని ఇటు ఉప్పటింప పాటియె మీకున్ ఆలో

చింపక మీ గృహములలో బంధముల మీది మూతలు తియ్య, ఊరకే

అపవాదులు వెయ్యా, కాలు దువ్వుచు మీరు..

కలతాకొచ్చితిరేమో, బాలుండే మెరుగు మీ పాలభాండములపై || మూతలు

7. నమ్మవు నామాటలు గోపెమ్మరో నీ కొడుకు ఎంతో మతిమంతుడే మమ్మిమ్మ

ని అడిగెను దానము నిమ్మ పలద్వయమటంచు నీరజాక్షుడు

నీ కనులకు బాలుడే ఇతడు సొమ్ములిచ్చెదను ఓ సుదతి కేళికి మమ్ము రమ్మ

ని పిలిచే

ఓ రవికోటి ప్రభగల నీరజాక్షుడూ ||

8. జలకము లాడుచు మడుగులో తిలకము గల మోము జొచ్చి ధీరోత్తకుడై ఉలికిపడి బూచి కలవని కిలకిలలాడేటి చిన్ని కృష్ణుని పనులు చేయుట కల్లా సృష్టించి మీరు కలిసి గొల్లెతలతో ఇటువలె పలికితివా లేదా నాతో నిజమూ ॥కృష్ణుని పనులు ॥

9. బొమ్మల పెండ్లిండ్లకు నన్ను రమ్మని యాజ్ఞీకములకు రమణులు హరిచే కొమ్మనిరి. దక్షిణమ్ములు నిమ్మఫల ద్వయమటంటే నిజమేనను కొంటి గరితలు ఇట్లా పలుకగ వింటే

అమ్మారో పొరుగిండ్ల కడుగుపెట్టానంటె కొమ్మలు గొనిపోయి కొరత మాటలు నన్ను ॥ పలుకగ వింటే ॥

10. ఒద్దరికంబున ఈ పసి బిడ్డడు మరికేళి గూడ నేగెనటంచునే దొడ్డ చిత్రంబు నాటికి అడ్డము లేకుండ చెపుదు రౌరా చెలులారా మీ కిటువంటి బిడ్డలు లేరే ! గొడ్డుమోతులు కారే కోపించి వానిపై సొడ్డు వేసేదరే! శ్రీ సరసిజాక్షుని వంటి బిడ్డలు లేరా ?

11 . మేలనుచు భక్తి చేతను పోలేరమ్మకును చద్ది పొంగలి చేయం మూలను దేవర గలదని హేళనతో బోనమంత ఎంగిలి చేసెన్ స్త్రీలను గలిసి అరిచెన్, బాలకృష్ణా ఇట్టి పని చేయ తగదంటే

అలాగే దేవికి ఆనందమని చెప్పె ॥ ఎంగిలి చేసెన్ ॥

12. శ్రీకృష్ణా గొల్ల ఇండ్లకు పోకురా నా తండ్రీ! చిన్న బొజ్జకు ఎంతో ఆకలి దీరగా ఇంటను ప్రాకటముగ కుడువరన్న పాలలో బువ్వ అయ్యయ్యో నీకూ ఈ రవ్వ, భక్తితో ఎన్నెన్నో చేసితి వ్రతములు నీ కొఱకు, అర్థించితి నిఖిల దేవతలను ॥ పాలల్లో బువ్వ ॥

13. రంగుగా శక్తికి చెలియలు పొంగుచు సేవలు యొనర్చి ఓరిమి తోడ శృంగారము లలరగ వేయి భంగుల ప్రార్థించిరమ్మ భామలందరూ దేవరా ఎంగిలనుచు మింగేరో, రంగడు మొగడైతే రమణీ ఇచ్చట చదరంగమాడుదామా అని రాగాలు పాడుచు ॥ భామలందరు ॥

14. ఏడాది బాలుడిటువలె కొడిగములు సల్పెనంచు కోమలులారా ఏమి వచిస్తిరే నోటను చూడగ యని నిజమటనుచు సుందరులారా చాలు మీకిటుల నిందా వేసెదరో, నీడ చూసితే భయము నీలవర్ణుడు మిమ్ము క్రీడాకు రమ్మని కూడి వచించెనా ॥ సు౦దరు ॥

15. ఆవులు మీరందర నే కేవలమాంబోతు ననుచు క్రీడింపు ఒక త్రావున మిము మళ్ళించెద బావను మీకంచు మాతో భాషించే నమ్మా. నీవిటు మమ్ము దూషించకమ్మా ఏమి యైనను యశోదా నీపాద సేవ చేతుము గాని సెలవిచ్చి రక్షించు ॥ భాషించె నమ్మా ॥

16. నీరజలోచన వినరా కోరి విటు బల్కితిని స్త్రీలు గోవులటంచున్ సారెకు నే బసవుడనని ధీరతతో బలికినావా ! ధేనువా చరణ ఝుడియాక చెప్పు

నిజపాప హరణా కూరిమి తోడుత కుందరదనా నీ నేరములెన్ననె నెరజాణ లేదురా ॥ ధేనువా చరణా ॥

17. కొత్తగా వచ్చిన కోడండ్రు, అత్తల ఆజ్ఞలను మీరి ఆడిరి ఒకటే చిత్తయు కేళి విలాసము మొత్తముగా ఆడిరెంతో మోదమలో బ్రహ్మనంద వారిథి పాలై ఉత్తమ గోవులా ఉవిదాలము మేము భర్తవైన నీవె బసవదేవుడా వంచు మోదమానసులై ॥ ఆడిరి ॥

18. మాటకి బాలుడనని నోట వచించెదరు మీరు నెఱజాణలు మీ బూటక ములకేమొచ్చెను బొండిరో మీ ఇండ్ల కివుడు పోరే లలన మాటకి మీరు ప్రకటించవలెనా అడుగు దాటగా తోడు అరవింద నయనుండు దాటనేరడే గడప దారి కడ్డమైతే ॥ పోపోరే ॥

19. శయ్యన పతులను మేమొక శయ్యన్ నిదురించునంతసేపు జని వారయ్యలు దొంగలు పడిరని గయ్యాళిగ కేకలేసి కలవర బుచ్చెన్ పతులను లేపి భయ కంపించి బయ్యారులారా మీ వల్లభు తీరని శయ్యలపై కొచ్చి చాతుర్యములు సల్పి ॥ కలవర బుచ్చే॥

20. కయ్యలు పెట్టినావని అయ్యా నీపైనే చాడీ లాడిరి. పసిమి ఉయ్యాల గట్టి ఊంచెదరా వెయ్యారు విధంబులను వేడుకలలరా, పాడుచు ఊచుచు చూడ సొంపులలరా నెయ్యముతోడుగ నీతి దప్పి మనకియ్యడ గొల్లవారిండ్ల కేమిపని వేడుక లలరా ॥

21. భామలు దాగుడు మూతలు వేమరకను ఆడి దొంగ వెళ్ళినటంచున్ ఈమూల కలడు కలడని శ్రీమంతుని గనిరి ఒక్క దిక్కుగా చెలులు చిక్కుననుచ నిక్కి చూచెదరు పామరులగు, వారి పతుల పైని వారేమి కోడించిరో ఎరుగ నొక్కటి తల్లీ ॥

22. ఓ చెలులారా ఇటువలె నీచపు మాటలను పల్క నీతియే మీకున్ నా చిన్ని బాలుడిటువలె వాచుండునే గొల్ల పాల వెన్న నేతులకు మీ ఇండ్లలో కాచి ఉంచుటకు, చూచి చూడని మాట సుదతి ఆడితే నంగనాచులను కొందురే నలుగురిలో మిమ్ము ॥ కాచి ఉండుటకు ॥

23. కట్టెను నిద్రలు పోవగ జుట్టుకు ఒక దండలోన జూలుకు బాగా గట్టిగ బిగించియుదా రెట్టింపుచు వీధి లోకి వేగా నేగెనో తాను వెంబడి తాను బాగా వనమాలీ కొట్టేదామని మేము కోపించి పలుకగా పట్టి మమ్మేకొట్టి పకపకా నగవుచూ ॥ వేగా నేగెనో ॥

24. మందకు భయ హారముగా జని సుందర సుకుమార వాని జుట్టుకు తీగన్ ఎందుకు బంధించితివట పొందుగ నాతో నిజము పలుక రోరన్నా కొట్టేదాకా నిజము పలుకకా యున్న అందెలు కదలంగ అలాగే నీవిటువలె చిందులు తొక్కుచు చిలిపితనము మాని

25. బాలికామణి ఒక ముసలి పోరడు నిద్రించునంత బలిసిన చూడన్ వాలమునకు జుట్టుకు నాడా లే బిగదీసెనే ఓ అమ్మ నెనెరుగ మలిపిరి తప్పు స్త్రీల పై తోలగా పాలుపోసెదను ఓ బావ రమ్మని పిలిచి స్త్రీలు కొండెము నాపై చెలరేగి మ్రొక్కెద॥ అమ్మ నేనెరుగ॥

26. ఉన్నవి లేనివి కొన్ని పన్నాగములు సలిపి పలు చతురతలూ వెన్నుని దుడుకుతనంబులు ఎన్నుచుదురోయి. ఓ అన్నలారా ఎంత గుణవంతులే మీలో మీరే సంతసిల్లెదరే చెన్ను మీరగా మదన చాతుర్యములు సలిపి చిన్నవాడేమెరుగు సిగ్గుమాలితిరేమో ॥ ఎంత గుణవంతులే ॥

27. జలకములాడేటి మడుగులో జలజాక్షుడు దొంగ వలెను చని మా చీరల్ వల మెప్పుగ మూట గట్టుక కలికి పొన్నలకు ఎక్కేదడిరే నీ మొక్కతే ఇవ్వదలచె నీ కడకు, పలుమారు నా పాదపంకజ యుగముల చెలగి మ్రొక్కరే రెండు చేతులెత్తిన గానీ ॥ గదిరే నీ కొడుకు ॥

28. పాటలు గంతులు వేరొక చోటను జలకంబులాడు సమయము వేళా మూటలు గట్టుకు చీరలు ధాటిక శ్రీకృష్ణా పొన్ని తరువు ఎక్కతివా భామామణుల పరువు చెరచితివా నీటి ఒడ్డున చెలుల నిను వేడిరట గొల్ల భామల ఇండ్లకు పోవద్దురా పొన్నా

29. చెంగల్వ కొలను లోపల అంగన మణులేగి జలకమాడేటి వేళెన్ రంగులు గలిగిన చీరలు మంగళ ప్రదముగను వారి మగలకే చిక్కే పొంగుచు వారే పొన్ని మానెక్కి శృంగారులగు వారి సిగ్గులభిమానము భంగా పుచ్చెను వారి ప్రియులే మెరుగుదురు.

30. వల్లభుల ఆజ్ఞ మీరిన ఇల్లాళ్ళికే, బుద్ధి చెప్ప ఈశుని తరమా చిల్లర ఆటలు మరిగిన పసిపిల్లాడిపై కొస్తిరేమి ? పిలిచి జగడమునకు ఎల్ల జగంబులేలే హరి కడకు, పల్లవాధరులారా బాలునికిక బుద్ధి చల్లంగా చెప్పెదను సఖియారా పోపోరే ॥ పిలిచి॥

31. చెన్న కేశవుల కృప చే పన్నుగ కందార్థములను భాషించితి ఈ వెన్నుని చరిత కథామృత మన్ననతో వ్రాసి చదివి విన్న జనులు సిరిసంపదలతో తూగి యుండెదరు. పన్నుగా ఆయురారోగ్యములు కలిగి శ్రీ చెన్ను మీరగా శ్రీనివాసుని చేరెదరు.

( కీ॥శే॥ నిడుమోలు కేశవరావు గారి ఆశీస్సులతో….. )

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page