October 2022

12_005 చిరు చిరు మొగ్గల…

పూలతోటలో – కాలి బాటలో
మురిపించెడు నీ మురళి పాటలో
తూగిన నా యెద – ఊయల లూగగ
ఎన్నినాళ్లదీ సహయోగం

12_005 ముకుందమాల – భక్తి తత్వం 12

అహంకారం భగవత్రాప్తికి ప్రతిబంధకం. అహంకారం తొలగితేనే కాని శిరసువంగదు. అహంకార రహిత స్థితి నందినందుకు గుర్తు శిరసువంగడం. గర్వితులగు రాజులకోఉపకారాలాశించి ధనవంతులకో నమస్కరించడం మామూలే. కానీ అలాకాక ఆ పరాత్పరునిసహజ ప్రేమతోభక్తితో శరణువేడి నమస్కరించడం తనను తాను పరమాత్మకు నివేదించుకోవడం అవుతుంది. భక్తి అంతరంగంలో ఉండటమేకాదు. దాన్ని భౌతికంగా కూడా వ్యక్తపరచగలగాలి అంటే మనోవాక్కాయ కర్మలా ఆ పరమాత్ముని సేవలోనే జీవితమంతా గడచిపోవాలన్నమాట. ఈ దశలన్నీ సదా అనుభవిస్తూ ఉండాలన్నదే శ్రీ కులశేఖరుల వారి కోరిక!

12_004AV వార్తావళి

చెన్నై అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఆధ్వర్యంలో నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా “ జగమునేలిన తెలుగు ” కార్యక్రమ వివరాలు, అమెరికాలో బే ఏరియా తెలుగు సంఘం స్వర్ణోత్సవాల వివరాలు….

12_004AV ఆనందవిహారి

న్యూజీలాండ్ లో ప్రత్యక్ష వేదిక మీదా, ఇటు అంతర్జాలం లోనూ విజయవంతంగా జరిగిన 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు విశేషాలు….

12_004AV సింహనందిని

ప్రాచీన కాలంలో ఆలయాల్లో ఉత్సవాలు జరిగే సమయంలో ఆలయ నృత్య కళాకారులు రధోత్సవ సమయంలో రధం బయిల్దేరుతుండగా ఆ రధం ముందునృత్యం చేస్తూ కాలితో, రంగుల పొడి ని జల్లుతూ ఆ ఆలయంలో ఉండే దేవతా మూర్తి యొక్క వాహన రూపాన్ని చిత్రీకరించేవారు. “ సింహనందిని ” నృత్యంలో దుర్గామాత వాహనమైన సింహాన్ని, “ మయూర కౌతమ్ ” నృత్యంలో కుమారస్వామి వాహనమైన నెమలిని, “ మహాలక్ష్మి ఉద్భవం ” నృత్యంలో లక్ష్మీదేవి ఆసనమైన కమలం ఆకారాన్ని చిత్రీకరిస్తారు.