Annamayya

11_006 ముకుందమాల 02

బిడ్డలమైన మనను తండ్రి ప్రేమకు పాత్రులను చేసేది తల్లి శ్రీ. ఆమె లక్ష్మి. కృష్ణావతారంలో రాధగా, రుక్మిణిగా వచ్చినది ఆతల్లియే! ఆమె నాశ్రయిస్తే ఆమె ద్వారా పరమేశ్వరానుగ్రహం లభిస్తుంది. ఆ తల్లి అనుగ్రహం లేనిదే భగవదనుగ్రహం లభించడం కష్టం. భగవానుని నామాల్లో స్వామికి ఇష్టమైన నామం శ్రీవల్లభ! అందుకే ముందుగ ఆ నామంతో కీర్తించడం! అలా కీర్తించిననాడు భగవానుడు మనలను రక్షించకుండా ఉండలేడు. అమ్మద్వారా ఆశ్రయించడమే మన యోగ్యతగా, మనకు వరాలిస్తాడు.

11_005 AV తాళ్ళపాక అన్నమాచార్య కళాభిజ్ఞత 02

సంగీతానికి గమ్యం ఎప్పుడూ కూడా సహృదయ, సామాజికుని మనస్సును రసానందభరితం చెయ్యడమే ! ఆ రసానంద సిద్ధి అనేది చిరంతనమూ, సనాతనమూ, సదాతనము. దానికి ప్రధానాంశాలు నాదమూ, గానమూ, సాహిత్యము. ఈ రసానంద విశ్లేషణకి ఈ అంశాల విశ్లేషణ చాలా ముఖ్యం…..

11_004 ముకుందమాల

ప్రత్యేక సిద్ధాంతాలనన్నింటినీ, ఆత్మానుభూతితో భక్తిసూత్రంచే ముడిపెట్టి మానవుని జన్మమొదలు ముక్తివరకు గల క్రమవికాసమును సమగ్రంగా, సరళంగా, భక్తిపూర్వకంగా అనుభూతమొనర్చుకుని, పరంధాముని రూప, గుణ విభవాలను హృదయములో నింపుకుని, ఆ పారవశ్యంలో శ్రీకృష్ణ పాదారవిందాలపై ఉంచిన భక్తికుసుమాల మాల ఇది.

11_003 తాళ్ళపాక అన్నమాచార్య కళాభిజ్ఞత

అమెరికా చికాగొ నగరంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారతీయ సాహిత్యం, కళలకు సేవలందిస్తున్న శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా వ్యవస్థాపకులు డా. శారదాపూర్ణ శొంఠి గారి “ తాళ్ళపాక అన్నమాచార్యుని సంగీత, నృత్య కళాభిజ్ఞత ” గురించిన సోదాహరణ ప్రసంగ పరంపర లో మొదటి భాగం….

11_002 అన్నమయ్య – పోతన

ఒకరిది పద సాహిత్యమైతే, మరొకరిది పద్య సాహిత్యం. అన్నమయ్య పదాల్లో సాహితీ విలువలున్నాయి. పోతన పద్యాల్లో సంగీత బాణీలున్నాయి. వీరి పద పద్యాలు పరిశీలిస్తే నిత్య సత్యాలు, జీవన విధానం, దాని విలువలు, నిర్మలమైన మనోభావాలు, స్ఫూర్తి, మోక్షానికి మార్గం లాంటి సూత్రాలు కనిపిస్తాయి. “ఏకం సత్” అంటే శాశ్వతమైన పరమాత్మని అనన్యమైన భక్తితో స్తుతించి మోక్షాన్ని పొందారు అన్నమయ్య పోతనలు.