Bhamidi

13_008 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 12

ఎత్తైన, మెత్తని, చక్కని, చల్లని పూల సజ్జపై నీలదేవి కౌగిలిలో ఒదిగి వున్న మా స్వామీ కృష్ణయ్యా ! ఇలా నీ ఏకాంతానికి భంగం కలిగిస్తున్నందుకు మన్నించు. మా విన్నపం ఆలకించి బదులు పలుకు…. అంటూ నీలదేవి కౌగిలిలో సోలి నిద్రించు స్వామిని మేలుకొలుపుతున్నది గోదా…..

13_007 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 11

మనమంతా ఎంత అదృష్టవంతులమో ! శ్రీలు పొంగిన రేపల్లె మన జన్మస్థలమైంది. ఓ నెచ్చెలులారా ! నిండు జవ్వనులారా !
కంసుని భయంతో వేలాయుధం చేత ధరించి రాత్రింబవళ్ళు నందరాజు తన ముద్దులయ్యను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఆ నల్లనయ్య యశోదాదేవి ఒడిలో కొదమసింగంలా ఆడుకుంటున్నాడు మనోజ్ఞంగా….. ఇలా గోదాదేవి పాశురాల విశేషాలను వివరిస్తున్నారు.

13_005 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 10

దక్షిణ భారతదేశంలో ప్రభవించిన వాగ్గేయకారులలో ముఖ్యంగా మహిళా వాగ్గేయకారులలో ముఖ్యంగా చెప్పుకోదగిన పేరు గోదాదేవి. ఆమెకే ఆముక్తమాల్యద అనే పేరు కూడా ఉంది. శ్రీరంగం పట్టణానికి చెందిన గొప్ప విష్ణుభక్తుడు విష్ణుచిత్తుని కుమార్తె ఈమె. సీతాదేవి వలెనే ఈమె కూడా అయోనిజ. విష్ణుచిత్తుడు ఒకరోజు ఎప్పటిలాగే విష్ణు కైంకర్యానికి మాలలకోసం తులసి వనానికి వెళ్ళినపుడు అక్కడ దొరుకుతుంది. భగవత్ప్రసాదం గా భావించి ఇంటికి తెచ్చుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ఆ దంపతులు. విష్ణుసేవలో ఎదిగిన గోదాదేవి రోజుకొకటి చొప్పున ముఫ్ఫై రోజులపాటు గానం చేసిన పాశురాలన్నిటినీ కలిపి ‘ తిరుప్పావై ’ అంటారు. ఈ విశేషాలను వివరిస్తున్నారు.

13_004 సంగీతం – సర్వేశ్వరుని చేరే సాధనం 09

భక్త వాగ్గేయకారుల జీవితాలు మహిమాన్వితాలని చెప్పుకున్నాం కదా ! తులసీదాసు విషయంలో కూడా జరిగిన ఒక విశేషాన్ని చెప్పుకోవాలి. ఒకనాడు ఒక స్త్రీ విలపిస్తూ తులసీదాసు పాదాలకు నమస్కరించింది. ఆమెను ‘ దీర్ఘసుమంగళీభవ ‘ అంటూ ఆశీర్వదించాడు. ‘ నన్నెందుకు అవహేళన చేస్తారు స్వామీ ! నా భర్త చనిపోయారు. ఆ దుఃఖం లో ఉండి మీకు నమస్కరించాను ’ అంటుంది.
“ తల్లీ నాకు నిజంగా నీ భర్త మరణించిన విషయం తెలియదు. అప్రయత్నంగా అలా ఆశీర్వదించాను. రాముడే నా నోట అలా పలికించి ఉండాలి. ఆ వాక్కులు వృథా కారాదు. నీవు వెళ్లి చనిపోయిన నీ భర్త చెవిలో రామనామాన్ని ఉచ్చరించు. విశ్వాసంతో వెళ్ళు ” అంటారు. ఆమె అలాగే చేస్తే ఆమె భర్త బతికాడు.

13_002 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 08

అనాది నుండి పరమేశ్వరుడు స్వయంగా మెచ్చి కొలువున్న పట్టణం వారణాశి. సంగీత, సాహిత్య, ఆథ్యాత్మిక త్రివేణీ సంగమ స్థలం. జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని భావించే ప్రతి ఒక్కరూ కాశీ పట్టణాన్ని, విశ్వేశ్వర దేవుని దర్శించుకోవాలని తలపోస్తూ వుంటారు. అటువంటి కాశీ వాసులైన కొందరు భక్తుల గురించి చెప్పుకుందాం. భక్త కబీరు గురించి, ఆయన జీవిత విశేషాల గురించి చెప్పుకుందాం. ఎంతవరకు నిజమో తెలియదు గాని కబీరు దాస్ పుట్టుక గురించి ఒక అలౌకికమైన కథ ప్రచారంలో ఉంది. అది…..

13_001 ఓయి భారతీయుడా !

విశ్వశాంతి కాంక్షించే వేదం ధర్మం మనది
అల్ప భావనలు నింపే – మతములు మనకేలరా
రామరాజ్యమ్మును కృష్ణ సారధ్యమును
వివేకానంద స్ఫూర్తులందుకొనుమ సోదరా

12_011 ముకుందమాల – భక్తితత్వం

ఈ శ్లోకాలలో మహారాజు తెలియజెప్పాలనుకున్నది భక్తి… భక్తి… భక్తి… ఇదొక్కటే మానవునికి ఇహపర సాధనం! ఇహలోకంలో దీని వలన లాభమేమిటీ అని ప్రశ్నించుకుంటే చాలా లాభమే ఉందీ అని చెప్పాలి. భక్తి వలన మనిషిలో సాత్విత భావం పెరుగతుంది. ఓర్పు, సహనం అలవడుతుంది. అంతేకాదు. భక్తికి ప్రధాన లక్షణం ప్రేమ, ‘‘అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు’’

12_010 ముకుందమాల – భక్తితత్వం

ఎవ్వనిచే జనించి, ఈ జగమెవ్వని లోపల నుండి, ఎవ్వని యందు లీనమగుచున్నదో, అతడే పరమేశ్వరుడూ, పరబ్రహ్మమూ అని చెబుతోంది ఉపనిషత్తు. అతడు శ్రీకృష్ణుడే! విత్తులో అణిగి వున్న చెట్టులా, సూక్ష్మంగా పరమాత్మలో అణగి ఉండి, సృష్టికాలంలో ఆ పరమాత్మ సంకల్పంతో, లేచి, విస్తరించేలా, శ్రీకృష్ణుని యందే ఈ సర్వజగత్తు ఉన్నది. ఆ కారణతత్వమే శ్రీకృష్ణ పరబ్రహ్మ.

12_010 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం

అనాదిగా భారతదేశం అనేక భాషలకి, వివిధ మతాలకి నిలయం. ఆయా మతాల్లో, భాషల్లో ఎందరెందరో వాగ్గేయకారులు తమ తమ సంగీతాన్ని పరిపుష్టి కావించి, నాదంతో పరమాత్మను చేరగలిగే బాటను అద్భుతంగా మలచి, మనకందించి తాము సర్వేశ్వరుని సాన్నిధ్యాన్ని అందుకున్నారు. ఈ మతాలన్నీ కూడా వేద ప్రతిపాదితమైన సనాతన ధర్మపు మూలసూత్రాల ఆధారంగానే రూపు దిద్దుకున్నాయి. జీవనది లాంటి భారతీయ ఆథ్యాత్మికత కాల పరీక్షకు నిలచి మనుగడ సాగిస్తూనే ఉంది.
తమ రచనల ద్వారా జన బాహుళ్యంలో ఆస్తిక భావన పెంపొందించిన మహానుభావులను, వారి రచనలను గురించి…..

12_009 ముకుందమాల – భక్తితత్వం

నామరసాయనం నీకు శక్తినిస్తుంది. ఆ నామస్మరణ భగవంతునికి దాసుని చేస్తుంది. అంటే ఇంక ఈ చంచలమైన మనసుకు నీవు దాసుడవు కావు అన్నమాట! అప్పుడే పరమాత్ముని గురించిన జ్ఞానం పరమాత్మకు దగ్గర చేస్తుంది. ఈ రసాయనం లోపలి కల్మషాన్ని కరిగించి బలాన్నిస్తుంది. అంతటి శక్తివంతమైనది నామ రసాయనం. నామం ఉంటే నామి ఉన్నట్లే. నామి తోడుంటే మనసుకు బలం, ధైర్యం. విష్ణు కథలు వింటే అర్ధం అవుతుంది. ఆ స్వామి అండ ఎంత బలమో!