Dasika

12_009 శ్రీలక్ష్మి – కథ

సదా తన మనసెరిగి ప్రవర్తిస్తూ తన అలవాట్లను..తన బలహీనతల్ని..తన అహంకారాన్నీ..దురుసుతనాన్నీ భరిస్తూ వచ్చిన శ్రీలక్ష్మి, తనను వదిలి వెళ్ళిపోయి అప్పుడే పన్నెండు రోజులైంది అంటే హరిమూర్తి కి నమ్మశక్యంగా లేదు. శ్రీలక్ష్మి ఇక లేదు అన్న సత్యాన్ని, ఆమె సంపాదించుకున్న పేరును ఈ రెంటిని హరిమూర్తి జీర్ణించుకోలేక పోతున్నాడు. ఫ్యూనరల్ టైములో శ్రీలక్ష్మి పట్ల అందరూ చూపించిన గౌరవం, ప్రేమ, దుఖం చూసి అతను ఆశ్చర్యపోయాడు.

11_006 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – పరీక్ష

అడుగు పెడుతూనే ఇక్కడ ఎలా ఉండాలో.. ఎలా మాట్లాడాలో… ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవడంతో మొదలయ్యేవి ప్రాధమిక పరిక్షలు. తల్లీ తోడు లేని దేశంలో భయాన్ని…దిగులుని దిగమింగుకుని, ఒంటరిగా పిల్లల్ని సాకటం బెంగతో కూడిన పరీక్ష.
చిన్నవయసులోనే అన్నింటికీ “వై యామై డుయింగ్…వై డు అయి హావ్ టు డు?” అంటూ యక్ష ప్రశ్నలేసే పిల్లలకు సమాధానం చెప్పటం “బుర్ర గోక్కునే పరీక్ష”.
పిల్లలు కాస్త పెద్ద వాళ్ళయిన తర్వాత అన్నీ తమకే తెలుసుననుకుని వాదించే వాళ్ళతో గెలవటం “బుర్ర తినేసే పరీక్ష”.

11_001 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – వంటింట్లో ఆడవాళ్ళు

America Illali Mucchatlu – Vantitlo Adavallu
ఇంటిపట్టున ఉండే ఆడవాళ్లకు, అందులోనూ వంటలు చేసుకునే ఆడవాళ్లకు ఏమి తెలియదని, లెక్కాడొక్కా రావని వెనకటి రోజుల్లో వాళ్ళను చిన్న చూపు చూసేవారు. నిజానికి వాళ్లకుండే తెలివి తేటలు, సామర్ధ్యం ముందు, చదువుకున్న వాళ్ళు, బయట తిరిగే మగవాళ్ళు ఎందుకూ పనికి రారు. మా ఊళ్ళో వంటింట్లో ఉంటూనే ఊళ్ళేలిన ఆడవాళ్ళు బోలెడంత మంది ఉన్నారు.