Ivaturi

12_009 శ్రీరామ రామేతి

శ్రీ విష్ణు సహస్రనామ పారాయణతో సంబంధం గలిగిన శ్లోకం ‘ శ్రీ రామ రామేతి…. ’. ఆ సంబంధం ఏమిటి ? అసలు సహస్ర నామ ప్రాశస్త్యం ఏమిటి ? ఎందుకు చదవాలి ? దానికి ఈ శ్లోకము ఎలా ప్రత్యామ్నాయము అవుతుంది ?… ఈ విశేషాలు…..

12_008 శివతత్వమ్

అవ్యక్తమైన స్వరూపం కలిగినవాడు శివుడు. సృష్టి, స్థితి, లయ అనే వరుస సాధారణమైనది. ఇలా సృష్టి నుంచి కాకుండా లయం నుంచి ప్రారంభమైతే సృష్టి జరిగి స్థితి అనేది లయకారుడైన ఈశ్వరుడు తనంతట తాను తనలోకి తీసుకునే వరకు ఉంటుంది.

12_007 ఉత్తరాయణం

సూర్యుడు తన నిరంతర యానంలో మకర రాశిలోకి ప్రవేశించే రోజునే ‘ మకర సంక్రాంతి ‘ అని పిలుస్తారు. దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కు కు సూర్యుడు తన ప్రయాణ దిశను మార్చుకునే సందర్భాన్ని ‘ ఉత్తరాయణం ‘ అని అంటారు. ఈ ఉత్తరాయణం చాలా విశిష్టమైనది. ‘ ఉత్తరాయణ పుణ్యకాలం ‘ అనడం అందరూ వినే ఉంటారు. ఆ విశేషాలేమిటో డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు గతం లోని ఈ వీడియోలో వివరిస్తున్నారు.

11_001 AV – దక్షిణాయనం

Dakshinayanamu – ISR

దక్షిణాయనము, ఉత్తరాయణము అనేవి సూర్యుని యొక్క గమనమును బట్టి నిర్దేశింపబడతాయి. మనం ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యోదయాన్ని గమనిస్తూ వచ్చినట్లయితే రోజు రోజుకూ సూర్యుడు ఉదయించే దిశలో మార్పుని స్పష్టంగా గమనించవచ్చును.