Kavitha

13_009 ద్విభాషితాలు – సాధన

నిస్వార్ధంగా మన ప్రేమను స్వీకరించే మూగ జీవాలను ప్రేమించడం సాధన చేస్తే విశ్వ జననీయమైన ప్రేమ ఉద్భవిస్తుందనే తలపులోంచి పుట్టినదే సాధన అనే ఈ కవిత.

13_008 ద్విభాషితాలు – అదృష్టవంతుడు

అనుమతులు… పరిమితులు లేకుండా రోజురోజుకీ పెరిగిపోతున్న శబ్దకాలుష్యం తెలియకుండానే ఎన్నో కార్యకలాపాలకు ఆటంకంగా నిలుస్తోంది. ఆ భావనలోంచి ఉద్భవించిన కవితకు దృశ్య శ్రవణ రూపమే ఈ అదృష్టవంతుడు

13_007 ద్విభాషితాలు – మందు మంట

తరతరాలుగా పురుషులు అలవర్చుకుంటున్న దురలవాట్లు….స్త్రీల జీవితాల్ని చీకటిమయం చేయడం దురదృష్టం. ఆ వేదన లోంచి పుట్టిన విషాద కవితే…. మందు మంట

13_006 ద్విభాషితాలు – పొగబండి

బాల్యంలో పొందిన అనుభూతులు కొన్ని జీవితకాలం వెంటాడి మనకు తీయని బాధను కలిగిస్తాయి. నా బాల్యంలో మనసును దోచుకున్న పొగ రైలుబండి ఈ కవితకు ప్రేరణ.

13_005 ద్విభాషితాలు – వివశం

అమెరికన్ కవి అయిన Robert Frost కవిత… Stopping by the Woods on a Snowy Evening ఈ “వివశం” కవితకు స్ఫూర్తి! సౌందర్యాస్వాదనకు…. బాధ్యతా నిర్వహణకు మధ్య..మనిషి పడే సంఘర్షణ ఇందులో ప్రధానాంశం.

13_004 ద్విభాషితాలు – అద్దం మీద పిచ్చుక

మూగజీవుల జీవన విధానాన్ని….గమనాన్ని పరిశీలించడం ఓ కళ. అదో గొప్ప శాస్త్రం. తరచూ అద్దం మీద వాలి సందడి చేసే ఓ పిచుకని చూసినప్పుడు నాలో కలిగిన ఆలోచన….ఈ కవితకి ప్రేరణ.

13_003 అన్నమాచార్య కళాభిజ్ఞత 18

రామాయణం త్రేతాయుగ కాలానికి చెందిన రామస్వామి వృత్తాంతం. మానసిక పరివృత్తికి, ధార్మిక ప్రవృత్తి కి, సుకర్మానురక్తికి మార్గం చూపగలిగే దివ్యమైన కావ్యము.
తేన వినా తృణమపి న చలతి
నీ సంకల్పమే లేకపోతే ఏదీ సాధ్యం కాదు. సర్వం రామ సంకల్పాధీనం అని ఎరిగిన అన్నమాచార్యులు రామకథ ని అత్యద్భుతంగా తన సంకీర్తనలలో రచించిన వాటికి కొన్ని ఉదాహరణలు….

13_002 ద్విభాషితాలు – పేద

ప్రకృతి ఒడిలో విభిన్న సౌందర్యాలు…. మనిషి ఆనందం కోసమేనన్న సత్యాన్ని విస్మరించి…. యాంత్రికంగా జీవిస్తున్న మనిషి తీరు ఈ కవితకు ప్రేరణ.