12_009 ఆమని
ఇది సరికొత్తఉగాది !
శిశిరశిధిలాలమీద శిర సెత్తినఆశలపునాది !
ఇది – దక్షిణపుగాలి వింధ్య తలదన్ని దిక్కుల నేకం చేస్తున్నవేళ !
ఆ సేతుశీతాచాలమూ అధికారాన్ని చలాయిస్తున్నవేళ !
ఇది సరికొత్తఉగాది !
శిశిరశిధిలాలమీద శిర సెత్తినఆశలపునాది !
ఇది – దక్షిణపుగాలి వింధ్య తలదన్ని దిక్కుల నేకం చేస్తున్నవేళ !
ఆ సేతుశీతాచాలమూ అధికారాన్ని చలాయిస్తున్నవేళ !
కండబలముతో గుండెబలముతో
దండిమగల మనిపించాలి !
నీతికి నిలబడి నిజాయితీతో
జాతిపేరు నిలబెట్టాలి !
కోనసీమ కవికోకిల డా. వక్కలంక లక్ష్మీపతిరావు గారు రచన, శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో బృంద గానం….
వంపుసొంపుల నా కొమ్ములలో
వాడనివీడనిఅందా లున్నవి !
సన్నగ కీసగ ఉండే కాళ్ళే
ఉన్న అందమునుచెఱచుచున్నవి !