Kuchi

12_012 అపరాధ సహస్రాణి

కళలమ్మ పాదాలపై పడి జన్మలు వేడుకున్నా దొరకని వరం కళాప్రవేశం!
రేణువంత దొరికినా అది ఆ చల్లనితల్లి కృప!
ఏదో జన్మవాసనలు మనసునిపట్టి ఏదైనా ఒక్క లలితకళలో ఆవగింజంత అభినివేశం దొరికినా జన్మధన్యమే!
దానిని పరిపూర్ణాంగా కాకపోయినా..కొనఊపిరి ఉన్నంతవరకూ నిలబెట్టుకోవడం అసిధారావ్రతం!

12_010 కుంచె గాడి కృతజ్ఞత

“నీ చిత్రకల్పనలు వినువీధుల విశ్వకళాసృష్టికి కొత్త ద్వారాలు తెరవాలి కూచీ!”
అని మహదాశీస్సు ఇచ్చి ఉత్తేజపరచిన “యుగకవి” శ్రీగుంటూరు శేషేంద్ర శర్మగారి “కవిదీవెన”కు నిలువెత్తు సద్యోయోగం ఈ సందర్భం.