Lakshmipati

13_004 సాక్షాత్కారము 07

చావు ముంచుకొని వచ్చిన
జీవుల కిక భయ మెక్కడ ?
నిరాశ నిండినదీనుల
నిట్టూర్పుల కం తెక్కడ ?

13_002 సాక్షాత్కారము 05

తే. గీ. ఏమహాశక్తి త న్నావహించెనొ ? యన
తరుణిపై పతి ప్రేమగీతాలు పాడు :
అంత నెద పొంగి మగతోడు నరసియరసి
కూర్మి గట్టిగా వాటేసికొను కపోతి !

13_001 సాక్షాత్కారము 04

తే. గీ. ధరణి రాలియు వాడక పరిమళాలు
తఱగనిబొగడపూ లేమితపము చేసె !
ౘచ్చియును కీర్తి దేహాన శాశ్వతు లయి
బ్రతుకు త్యాగుల కివి ఒజ్జబంతు లేమొ !

12_012 సాక్షాత్కారము 03

తే. గీ. ఎండవానలలోన తా మెండి తడిసి
శ్రితుల నీడ నిచ్చి సమాదరించుతరులు ;
తమఫలమ్ముల నొకటియున్ తాము తినక
పరులకై దాన మొనరించుతరులు ఋషులు !

12_011 సాక్షాత్కారము 02

తే. గీ. ఆకలింగొన్నవారికి అన్నపూర్ణ
యైన దిచట డొక్కాసీతమాంబ ! ఆమె
పుట్టువుం గన్నయీపుణ్యభూమిలోన
భళిర ! క్షుద్బాధతో ౘచ్చువాఁడు లేఁడు!

12_010 సాక్షాత్కారము 01

తే. గీ. కోటికోటిరంభలతోడ కులుకు లొలిక
స్వర్గమునె తలదన్ను నీసవనభూమి !
గరుడపచ్చలు కెంపులు కనులముందు
పఱచిన ట్లుండు నిచ్ఛటిపంటచేలు !

12_009 ఆమని

ఇది సరికొత్తఉగాది !
శిశిరశిధిలాలమీద శిర సెత్తినఆశలపునాది !
ఇది – దక్షిణపుగాలి వింధ్య తలదన్ని దిక్కుల నేకం చేస్తున్నవేళ !
ఆ సేతుశీతాచాలమూ అధికారాన్ని చలాయిస్తున్నవేళ !

12_008 బాలభారతి – బాలలూ !

కండబలముతో గుండెబలముతో
దండిమగల మనిపించాలి !
నీతికి నిలబడి నిజాయితీతో
జాతిపేరు నిలబెట్టాలి !