August 15, 2022

12_001 వార్తావళి

హైదరాబాద్ లో ‘ నాద తన మణిశమ్ – చిత్తరంజనం ‘ పుస్తకావిష్కరణ, 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు వివరాలు…

12_001 ఆనందవిహారి

అమెరికా లో శ్రీ షిర్డీసాయి మందిర్, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ), తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగొ ( TACC ) సంయుక్తంగా నిర్వహించిన సంగీత, సాహిత్య కార్యక్రమం విశేషాలు, చెన్నై అమరజీవి స్మారక సమితి అధ్వర్యంలో నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా “ విశ్వసాహిత్యం – మాలతీచందూర్ దృక్పథం ” కార్యక్రమ విశేషాలు….

12_001 కూచింత కాఫీ

చిత్రకారుడు ‘ కూచి ’ కుంచె నుంచి జాలువారిన కాఫీ హాస్య, వ్యంగ్య గుళికలు…… మరికొన్ని… .

12_001 చేతికొచ్చిన పుస్తకం 06

‘ గాంధీ మహాత్ముడు నూరేళ్ళు ’, ‘ వాణిశ్రీ అభినందన సంచిక ‘, ‘ తెలుగువారి చరిత్ర – వేర్పాటువాదం ‘, ‘ రాయలసీమ కరువు కథలు ‘, ‘ కస్తూర్బా ‘ పుస్తకాల పరిచయం…..

12_001 కన్యాశుల్కం – ఒక పరిశీలన

ఈ నాటకం కన్యాశుల్క దురాచారాన్ని బలం గా ఖండించడం కోసం రాయడం జరిగింది అనే వాదన ఉన్నప్పటికీ నాటకం లో ప్రస్తావన చేసిన విషయం ముక్కుపచ్చలారని బాలికలను వయోవృద్ధుల కు కన్యాశుల్కం తీసుకుని వివాహం చేయడం. వృద్ధులకు బాలికల నిచ్చి పెళ్ళి చేయడం ఖండించదగిన సామాజిక దురాచారం. అప్పటి కన్యాశుల్కం, ఇప్పటి వరకట్నం వ్యక్తుల ఆర్ధిక వ్యవహారం.

12_001 అష్టావధాన వైభవం

ఇకపై బంగళపాకలన్ చనక తామే భవ్యగేహస్థులూ
రకనేపాలకుపిల్లలేడ్వనటులన్ రాణింపుమా భారతీ !

12_001 తో. లే. పి. – జయ పీసపాటి

మాట మనసులను కలుపుతుంది.. కలిపి ముడి వేస్తుంది.. అది నిజానికి భగవద్దత్తమయిన అమూల్య వరం. ఆ వర ప్రసాదాన్ని కాపాడుకుంటూ ఉండడం అందరి కర్తవ్యం !

12_001 శ్రీ రామాయణం లో హాస్యం

రామచంద్రుని దగ్గరకు వెళ్ళి ఆయనని పరికించి చూడగానే ఆ ముగ్ధ మనోహర లావణ్యమూర్తి అందంతో వారి కళ్ళలో ఆనందాశ్రువులు నిండాయి. అనుపమానమైన ఆ సౌందర్యం చూచి తృప్తిపడి చకితలై నిలబడి పోయారు. వాళ్ళకి తమ ఎదుటనున్న సుందర మోహనరూపం తప్ప ప్రపంచం కనిపించడం లేదు. తమని తాము మర్చిపోయారు. ఇక హారతి ఇచ్చేదెవరూ ? కొంతసేపటికి ఆ ప్రేమ సాగరం నుంచి బయటికి వచ్చి తమని తాము సంబాళించుకోసాగారు. అప్పుడు లక్ష్మీనిధి అశ్వం మీద నుంచి దిగి బావలకు చేయి ఆసరా ఇచ్చి దింపి మందిరం లోపలికి తీసుకువెళ్లాడు.