అమెరికా ఇల్లాలి ముచ్చట్లు-బరువు
- 08_006
- April 1, 2019
Tags: AgeAmericaAmerica illali muchatluArmyBaruvuBombayCarChildrenChitchatChristmasCitizenCleanerCoatCoffeeCollegeDashikaDasikaDelivaryDesignationDiamondDiaperDinnerDoorsDurabilityEducationFinancialFurnitureGiftGoldHoneymoonHotelHouseHousewifeIllaluIndiaInsuranceJobKanchiKitchenLifeLiteratureMarriagesMoneyMonthMotherMuchchatluMugNightOldPaperPartyPensionPlanPlanePlateQualityRamyaSalvationSareesShyamalaSilksirakadamabamSonSujathaSyamalaSyamaladeviTeluguTelugu writersUncleUSVaccumWatchWeb magazineWeightWifeWinter
దశిక శ్యామలాదేవిగారి అమెరికా ఇల్లాలి ముచ్చట్లు అద్భుతముగా అప్పుడే వేయించుకుని ప్లేటులో పెట్టుకున్నపప్పు చేగోడీలుగా కరకర లాడుతున్నాయి.ఆ రోజులలో వాడే చీరలు నగలు అప్పటిరోజులు సంప్రదాయాలు కళ్లకుకట్టినట్లుగా చూపించారు.”భారీ”అనే పదానికి కధమొత్తం బిరుదాంకితం చేసారు.అప్పట్లో మా నయనమ్మగారి వేసుకున్న చంద్రహారాలు,నాగరం,మా మేనత్తలు పెట్టుకున్న లోలక్కులు,జడగంటలు,చంపస్వరాలు,జిగని గొలుసు,నయనమ్మగారి కట్టుకున్నరంపం అంచుల బరంపురం పట్టుచీర,వెల్లవేట్ జాకెట్లు,కాళ్లకు వెండికడియాలు,మురుగులు అవి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో భర్త పక్కన నిండా పైట కప్పుకుని నిలబడిన ఫోటో గుర్తుకు వచ్చేలా చేసారు.ప్రస్తుత కాలం జీరో సైజు మరియు లైట్ వెయిట్ యుగం .నెయ్య,నూనెకు ఆమడ దూరం,పచ్చళ్లు,ఊరగాయలు హై చొలెస్ట్రాల్ ఫుడ్స్, ఒబ్బట్లూ,కాకినాడ కోటయ్యగారి కాజాలు,పూతరేకులు జంక్ మరియు ఆన్-హైజెనిక్ ఫుడ్.ఇంతగా అలెర్టుగా ఉన్న, ఆరోజులు మాదిరి మనుషులలో రెసిస్టన్స్ పవర్ ఎందుకు ఉండటంలేదు. ఎనిమిదిమంది సంతానంకన్నా మా మేనత్తఎనభై ఏడు సంవత్సరాల వయస్సులోకూడా తొంభై ఒకటి సంవత్సరాలుగల భర్తతిన్న వెండికంచంలో తింటుంది.ఎటువంటిరోగం లేకుండా భార్య భర్త వానప్రస్థా జీవితాన్ని చక్కగా వెళ్లబుచ్చుతున్నారు.